Motocorp: కొత్తగా బైక్, స్కూటీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. దిమ్మతిరిగే షాక్..

|

Nov 26, 2022 | 9:44 AM

కొత్తగా బైక్ లేదా స్కూటీ కొనాలని ఆలోచిస్తున్నారా.? అయితే ఒక్క క్షణం ఆగండి.! ఈ వార్త మీకోసమే.. దిమ్మతిరిగే షాక్..

Motocorp: కొత్తగా బైక్, స్కూటీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. దిమ్మతిరిగే షాక్..
Motor Bikes
Follow us on

కొత్తగా బైక్ లేదా స్కూటీ కొనాలని ఆలోచిస్తున్నారా.? అయితే ఒక్క క్షణం ఆగండి.! ఈ వార్త మీకోసమే. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ బైక్‌లు, స్కూటీల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఒక్కో వాహనంపై రూ. 1500 వరకు పెంచుతున్నామని.. మోడల్, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధర పెంపు పెరగొచ్చునని తెలిపింది. కొత్త ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఉత్పత్తి, ద్రవ్యోల్బణ వ్యయాల కారణంగా మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను సవరించాల్సిన అవసరం ఏర్పడిందని కంపెనీ పేర్కొంది.

మరోవైపు కస్టమర్లపై అధిక భారం పడకుండా ఉండేందుకు సంస్థ వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడాన్ని కొనసాగిస్తుందని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. కాగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్.. ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ఇది నాలుగోసారి. హీరో మోటోకార్ప్ చివరిసారిగా సెప్టెంబర్‌లో ఎక్స్-షోరూమ్ వాహనాల ధరలను రూ. 1000 వరకు పెంచిన విషయం విదితమే. ఈ పెంపుతో టీవీఎస్, బజాజ్ ఆటో వంటి ఇతర ప్రముఖ ఓఈఎంలు సైతం తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..