Hero MotoCorp: వాహనదారులకు హీరో కంపెనీ షాక్.. అన్ని ద్విచక్రవాహనాలపై ధరల పెంపు.. ఎంత పెరిగిందంటే..

|

Jun 25, 2024 | 3:47 PM

ఇప్పుడు ముఖ్యమైన అప్ డేట్ ను హీరో మోటోకార్ప్ అందించింది. జూలై 1 నుంచి భారత మార్కెట్లో అందిస్తున్న మొత్తం శ్రేణి మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. హీరో స్పెండర్, హీరో ప్యాషన్, హీరో గ్లామర్ వంటి అత్యధికంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాలతో సహా హీరో మోటోకార్ప్ అందించే అన్ని మోడళ్లపై ధరల పెంపు ప్రభావం చూపుతుంది.

Hero MotoCorp: వాహనదారులకు హీరో కంపెనీ షాక్.. అన్ని ద్విచక్రవాహనాలపై ధరల పెంపు.. ఎంత పెరిగిందంటే..
Hero Motocorp
Follow us on

హీరో మోటోకార్ప్ నుంచి ద్విచక్రవాహనాలకు మన దేశంలో మంచి డిమాండే ఉంటుంది. ముఖ్యంగా స్ప్లెండర్, ప్యాషన్, గ్లామర్ వంటి బైక్ లతో పాటు ప్లెజర్ వంటి స్కూటర్లు కూడా మార్కెట్లో తన స్థానాన్ని నిలిబెట్టుకున్నాయి. ఇప్పుడు ముఖ్యమైన అప్ డేట్ ను హీరో మోటోకార్ప్ అందించింది. జూలై 1 నుంచి భారత మార్కెట్లో అందిస్తున్న మొత్తం శ్రేణి మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. హీరో స్పెండర్, హీరో ప్యాషన్, హీరో గ్లామర్ వంటి అత్యధికంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాలతో సహా హీరో మోటోకార్ప్ అందించే అన్ని మోడళ్లపై ధరల పెంపు ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పత్రికా ప్రకటన విడుదల..

హీరో మోటోకార్ప్ బ్రాండ్ నుంచి అన్ని మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కంపెనీ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ధరల పెరుగుదల రూ.1,500 వరకు ఉంటుందని.. అయితే అది మోడల్ ను బట్టి మారుతూ ఉంటుందని ప్రకటించింది. సంస్థపై అధిక ఇన్పుట్ ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్ సెట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది.

దేశంలో టాప్ ప్లేయర్..

హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీదారు. మన భారతీయ ద్విచక్ర వాహన రంగంలో కూడా కీలకమైన ప్లేయర్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అనేక విదేశీ మార్కెట్లకు బైక్ లను కంపెనీ ఎగుమతి చేస్తోంది. అయితే భారతదేశంలో భారీ ద్విచక్ర వాహన మార్కెట్ ఉన్నప్పటికీ, మే నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు ఏడు శాతం (సంవత్సర ప్రాతిపదికన) తగ్గి 479,450 యూనిట్లకు పడిపోయాయి. అదే 2023 మే నెలలో 508,309 యూనిట్లను కంపెనీ తయారు చేసింది. అయితే ఎగుమతుల విషయానికి వస్తే 2023 మేలో11,165 యూనిట్లు కాగా 2024 మేలో 18,673 యూనిట్లను ఎగుమతి చేసింది. దీంతో అక్కడ తగ్గిన పరిస్థితిని ఇక్కడ పూడ్చుకోగలిగింది.

ధరల పెంపు ప్రభావం..

హీరో మోటోకార్ప్ ఇండియా విక్రయాల పై ధరల పెంపు ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలోని మోటార్ సైకిళ్లు కంపెనీ అందించే స్కూటర్ల కంటే చాలా బలమైనవి. హీరో స్ప్రెండర్, హీరో ప్యాషన్, హీరో గ్లామర్ వంటి వన్ని పవర్ ప్లేయర్లే. అలాగే ఎక్సపల్స్, ఎక్స్ట్రీమ్ బండ్లు కూడా బాగానే సేల్స్ రాబడతాయి. ఇక ఈ కంపెనీ నుంచి డెస్టినీ, ప్లెజర్ + వంటి స్కూటర్ల కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలన్నీ పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..