Hero Marvick 440: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. హీరో నుంచి కొత్త బైక్.. లుక్ చంపేసిందిగా..

హీరో మోటో కార్ప్ నుంచి ఓ కొత్త ఉత్పత్తి మన దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దాని పేరు హీరో మార్విక్ 440. ఈ బైక్ సూపర్ స్పోర్టీ లుక్ లో అదరగొడుతోంది. ఇది మన దేశంలో ఇప్పటికే ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ లకు పోటీగా దీనిని కంపెనీ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది క్రూయిజర్ బైక్. ఈ బైక్ లో చాలా అధునాతన ఫీచర్లను యాడ్ చేశారు.

Hero Marvick 440: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. హీరో నుంచి కొత్త బైక్.. లుక్ చంపేసిందిగా..
Hero Marvik 440 Cruiser Bike

Updated on: Feb 18, 2024 | 8:22 AM

హీరో మోటో కార్ప్ నుంచి ఓ కొత్త ఉత్పత్తి మన దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దాని పేరు హీరో మార్విక్ 440. ఈ బైక్ సూపర్ స్పోర్టీ లుక్ లో అదరగొడుతోంది. ఇది మన దేశంలో ఇప్పటికే ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ లకు పోటీగా దీనిని కంపెనీ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది క్రూయిజర్ బైక్. ఈ బైక్ లో చాలా అధునాతన ఫీచర్లను యాడ్ చేశారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తోంది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉనన్న ఈ బైక్ ప్రారంభ దర రూ. 1.99 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. ఈ క్రమంలో హీరో మార్విక్ 440కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హీరో మార్విక్ 440 ధర, లభ్యత..

హీరో మార్విక్ 440 బైక్ కంపెనీ మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. వీటి ధరలను పరిశీలిస్తే బేస్ వేరియంట్ ధర రూ. 1,99,000, మిడ్ స్పెక్ వేరియంట్ ధర రూ. 2,14,000, టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1,24,000గా ఉన్నాయి. ఈ మూడు ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.

హీరో మార్విక్ 440 ఫీచర్లు..

బైక్‌కు ప్రీమియం నాణ్యతను అందించడానికి హీరో మావెరిక్ 440 ఎల్ఈడీ లైట్ అందిస్తోంది. డిజిటల్ కన్సోల్ మీటర్ కూడా ఉంది. దీని సాయంతో ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్‌లతో పాటుగా నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను మనం చూడవచ్చు. ఇది కాకుండా, మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి చార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఈ బైక్ టాప్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హీరో మార్విక్ 440 సస్పెన్షన్, బ్రేకింగ్..

బైక్ సౌకర్యవంతంగా ఉండటానికి, ఇది యూఎస్డీ ఫోర్క్, ముందు వైపున ట్విన్ షాక్ సెటప్, వెనుక వైపున టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంంది. ఇది కాకుండా, బ్రేకింగ్ డ్యూటీ కోసం, ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో ముందు భాగంలో 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. అలాగే, బైక్ నడపడానికి 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

హీరో మార్విక్ 440 ఇంజిన్..

ఈ బైక్ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైంది. ఇది 440 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 27 బీహెచ్పీ శక్తిని, 36 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలగుతుంది. ఈ ఇంజిన్‌ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంటుంది.

హీరో మార్విక్ 440 పోటీ వీటితోనే..

హీరో నుంచి వస్తున్న ఈ క్రూయిజర్ బైక్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 42, హోండా హైనెస్ సీబీ350, యెజ్డీ రోడ్‌స్టర్ వంటి బైక్‌లతో పోటీపడుతుంది.

బుకింగ్స్ ప్రారంభం..

ఈ బైక్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మార్చి 15, 2024 వరకు ‘వెల్‌కమ్ టు ది మావెరిక్ క్లబ్’ ఆఫర్‌ను కూడా ప్రారంభించామని కంపెనీ ప్రకటించింది. అలాగే కస్టమైజ్ చేసిన మావెరిక్ కిట్‌ను అందజేస్తున్నామని, ఇందులో రూ. 10,000 విలువైన యాక్సెసరీలు, మర్చండైజ్‌లు ఉన్నాయని కంపెనీ ఈ సందర్భంగా తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..