ITR Verify: 2020-21కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను దాఖలు చేసి ఇంకా ఈ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. సాధారణంగా ఐటీఆర్ రిటర్న్‌లు దాఖలు చేసిన నాలుగు నెలల్లోగా ఈ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వెరిఫై చేసుకోకపోతే డీఫెక్టివ్ రిటర్న్‌గా పరిగణిస్తారు. ఐటీఆర్ రిటర్న్‌ల ఈ-వెరిఫై కోసం ఫిబ్రవరి 28 చివరి తేదీ. ఈ-వెరిఫై చేసుకునేందుకు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు అకౌంట్, డీమ్యాట్ ద్వారా ఈ-వెరిఫై చేసుకునేందుకు వీలుంటుంది. లేకపోతే రిటర్ను దాఖలు చేసినప్పటికీ ఈ-వెరిఫై చేసుకోకపోతే అది చెల్లదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అయితే ఆధార్ ఓటీపీ ద్వారా ఐటీఆర్ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ద్వారా ఇక్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ధృవీకరించుకోవచ్చు. అలాగే ఈవీసీ ఆధారిత బ్యాంకు అకౌంట్ నంబర్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఇక ఈవీసీ ఆధారిత డీమ్యాట్ అకౌంట్ నంబర్‌తో వెరిఫై చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే ఐటీఆర్ 5 ఫిజికల్ కాపీలపై సంతకం చేసి బెంగళూరులోని సీపీసీకి పంపడం ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇక ఇ-ఫైలింగ్ లో ఇ-వెరిఫికేషన్‌పై క్లిక్ చేయాలి. అందులో అడిగిన వివరాలను నమోదు చేసి మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని జనరేట్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీ ఐటీఆర్‌ను ధృవీకరించుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా..
బ్యాంకు వెబ్‌సైట్‌లో మీ బ్యాంకు ఖాతాకు లాగిన్ కావాలి. అందులో ట్యాక్స్ ట్యాబ్ కింద ఇ-ధృవీకరణ ఎంపిక చేసుకోవాలి. తర్వాత మీరు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు మళ్లీంచడం జరుగుతుంది. మై అకౌంట్‌ను ఎంచుకుని ఈవీసీ కోసం క్లిక్ చేయాలి. 10 అంకెల ఆల్ఫా-న్యుమరిక్ కోడ్‌ను రూపొందించేందుకు మీ ఇమెయిల్, మొబైల్ నంబర్ పంపబడుతుంది. కోడ్ 72 గంటల పాటు చెల్లుబాటు అవుతంది. మై అకౌంట్ ట్యాబ్ కింద ఇ-ధృవీకరణను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఇ-వెరిఫైని ఎంపిక చేసుకోండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి. మీ పన్ను రిటర్న్ విజయవంతంగా ఇ-వెరిఫై పూర్తవుతుంది.
డీమ్యాట్ ఖాతా ద్వారా..
మీ బ్యాంకు ఖాతాను ముందస్తుగా ధృవీరించడానికి మీ ఇ-ఫైలింగ్ ఖాతాలోని ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, మీ డిపాజిటరీ పేరు వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ మీ డీమ్యాట్ అకౌంట్‌లో నమోదై ఉండాలి. మీ డిపాజిటరీ ద్వారా మీ వివరాలను ధృవీకరించిన తర్వాత మాత్రమేఇ-వెరిఫైని రూపొందించడానికి మీ డీమ్యాట్ ఖాతాను ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి: