Pensioners
జీవన్ ప్రమాణ్ పత్రం.. దీనికి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా పెన్షనర్లకు అవగాహన ఉండి ఉంటుంది. ఎందుకంటే వారు పెన్షన్ అందుకోవాలి అంటే ఇది తప్పనిసరి. మన దేశంలో అందరి పెన్షనర్లకు ఓ ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఇది పెన్షనర్ల ఆధార్ నంబర్ తో పటు వారి బయో మెట్రిక్స్ తీసుకొని ప్రభుత్వం వారికి అందజేస్తుంది. దీనిని ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో కూడా పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితాంతం పనిచేయదు..
పెన్షనర్లు సులువుగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మోడ్లో పొందవచ్చు. అయితే దీనికోసం దరఖాస్తు చేసే వారు ఒకసారి తీసుకున్న ప్రమాణ్ ఐడీ లేదా జీవన్ ప్రమాణ్ అనేది లైఫ్ సర్టిఫికెట్ అనేది జీవితాంతం ఉపయోగపడదని తెలుసుకోవాలి. ఈ సర్టిఫికెట్ కు వ్యాలిడిటీ ఉంటుంది. సర్టిఫికెట్ జారీ చేసే సంస్థ నిబంధనల ప్రకారం దానికంటూ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ పిరియడ్ అయిపోగానే కొత్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్ లో పొందే విధానం ఇది..
- పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆఫ్ లైన్ మోడ్లో సులువుగా పొందొచ్చు. అదెలా అంటే..
- దేశ వ్యాప్తంగా సిటిజెన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీ) ఉంటాయి. మీ సమీపంలోని సీఎస్సీ సెంటర్ ను వెతికాల్సి ఉంటుంది. అందుకోసం (https://jeevanpramaan.gov.in/)వెబ్ సైట్ లోకి వెళ్లి లోకేట్ ఎ సెంటర్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. లేదా మీ ఫోన్ నుంచి 7738299899 నంబర్ కి జేపీఎల్ అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ ప్రాంతం పిన్ కోడ్ టైప్ చేసి సెండ్ చేయాలి. ఉదాహరణకు JPL 522501 అని టైప్ చేసి 7738299899కి సెండ్ చేయాలి. ఆ తర్వాత ఆ సెంటర్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
- అలాగే ఆఫీస్ ఆఫ్ పెన్షన్ డిస్ బర్సింగ్ ఏజెన్సీస్(పీడీఏ) అంటే పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్, ట్రెజరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్..
- మీ ప్రమాణ్ ఐడీ జనరేట్ అయ్యాక.. మీ డిజిటల్ సర్టిఫికెట్ ను ఈ (https://jeevanpramaan.gov.in/ppouser/login) లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ప్రమాణ్ ఐడీ జనరేట్ చేసుకోవడం ఎలా అంటే.. జీవన్ ప్రమాణ్ వెబ్ సైట్లోకి వెళ్లి దానిలో న్యూ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ ని ఎంపిక చేసుకొని ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మీ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ చేయాలని అడుగుతుంది. వాటిని ఇచ్చి అథంటికేషన్ చేయడం ద్వారా అప్పుడు మీ ప్రమాణ్ ఐడీ జనరేట్ అవుతుంది. ప్రక్రియ అంతా విజయవంతం అయితే ఐడీ మీకు వచ్చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..