Investments: ఏజెంట్లతో జాగ్రత్త సుమా? పెట్టుబడి పెట్టేముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..

|

Aug 22, 2024 | 3:24 PM

మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోడానికి మీరు చేసే ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. ముఖ్యంగా ఏజెంట్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అందుకే నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న టాప్ సేవింగ్స్ స్కీమ్స్, ఏజెంట్ ద్వారా వాటిల్లో పెట్టుబడులు పేట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Investments: ఏజెంట్లతో జాగ్రత్త సుమా? పెట్టుబడి పెట్టేముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..
Investment
Follow us on

పెట్టుబడి పథకాలు మార్కెట్లో చాలానే ఉంటాయి. వాటిల్లో బెస్ట్ ఎంపిక చేసుకోవడం, దానిలో పెట్టుబడి పెట్టడం అనుకున్నంత సులభం కాదు. జాతీయ స్థాయిలో చాలా పథకాలు మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్(ఎన్ఎస్ఎస్) అని పిలుస్తారు. వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు కొంత మంది ఏజెంట్ల ఆశ్రయిస్తారు. వారి ద్వారా తమ పెట్టుబడులను డైవర్సిఫై చేస్తుంటారు. అయితే మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోడానికి మీరు చేసే ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. ముఖ్యంగా ఏజెంట్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అందుకే నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న టాప్ సేవింగ్స్ స్కీమ్స్, ఏజెంట్ ద్వారా వాటిల్లో పెట్టుబడులు పేట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ రకాలు ఇవి..

నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలు ఇవి..

  • పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్
  • నేషనల్ సేవింగ్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్
  • నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్ అకౌంట్
  • జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (VIII ఇష్యూ)
  • కిసాన్ వికాస్ పత్ర
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్
  • సుకన్య సమృద్ధి ఖాతా
  • మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023

వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు మీకు అధీకృత ఏజెంట్లు మీకు సహాయం చేస్తారు. అయితే వారిపై పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీ పరిశోధన చేయండి లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించండి

నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఏదైనా ఖాతా ను మీరు వ్యక్తిగతంగా పోస్టాఫీసు/బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా డబ్బును స్వయంగా జమ చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి ఖాతా వంటి నిర్దిష్ట పథకాలకు ఆన్‌లైన్ డిపాజిట్లు చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఏజెంట్ల ద్వారా పెట్టుబడి పెట్టే ముందు చేయాల్సిన, చేయకూడని అంశాలను పరిశీలిద్దాం.

  • మొదటిగా ఏజెంట్ల సర్టిఫికెట్ ఆఫ్ అథారిటీ, ఏజెన్సీ చెల్లుబాటు తేదీని తనిఖీ చేయడం ద్వారా అధీకృత ఏజెంట్ల గుర్తింపును తెలుసుకోండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను మీరే పూరించండి. అయితే, ఏజెంట్ సహాయం/మార్గనిర్దేశం పొందవచ్చు.
  • ఖాతా తెరవడం లేదా డిపాజిట్ చేయడం కోసం ఏజెంట్‌కు డబ్బు/పరికరాలు, పత్రాలను అందజేసేటప్పుడు ఏజెంట్ పూర్తి చేసిన అధీకృత రసీదులను అడగండి. ఈ రసీదు పుస్తకాలను ప్రభుత్వం ఏజెంట్లకు సరఫరా చేస్తుంది.
  • ఖాతా మెచ్యూరిటీ అయ్యే వరకు కౌంటర్‌ఫాయిల్‌లను భద్రపరచండి.
  • రసీదు ఇవ్వడానికి ఏజెంట్ తిరస్కరిస్తే ఆ విషయాన్ని పోస్టల్/జిల్లా అధికారులకు నివేదించండి.
  • పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి 10 రోజులలోపు ఏజెంట్ నుంచి పాస్‌బుక్ అందినట్లు నిర్ధారించుకోండి.
  • పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి 10 రోజులలోపు ఏజెంట్ నుంచి పాస్‌బుక్ అందని పక్షంలో, అపాయింటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేయండి; ప్రాంతీయ డైరెక్టర్, నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్; పోస్ట్‌మాస్టర్ కు ఫిర్యాదు చేయొచ్చు.
  • పాస్‌బుక్‌లో పేర్కొన్న మొత్తం, తేదీ, స్టాంపు, సంతకం మొదలైన వాటి కచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత పోస్టాఫీసు నుంచి ధ్రువీకరించుకోండి.
  • అనధికార వ్యక్తికి నగదును అందజేయవద్దు లేదా ఏజెంట్‌కు అనుకూలంగా చెక్కును జారీ చేయవద్దు.
  • రూ. 10,000, అంతకంటే ఎక్కువ పెట్టుబడులకు; సంబంధిత పోస్ట్‌మాస్టర్‌కు అనుకూలంగా మాత్రమే చెక్కును జారీ చేయండి.
  • మెచ్యూరిటీకి ముందు ఉపసంహరణ ఫారమ్‌ను పూరించవద్దు/సంతకం చేయవద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..