Income Tax: ఐటీఆర్ రిఫండ్ త్వరగా రావాలంటే ఈ ట్రిక్ పాటించండి.. మిస్ కాకండి..

|

May 10, 2024 | 5:14 PM

చాలా మంది ఐటీఆర్ ప్రక్రియ విజయవంతం అయ్యిందని చూపగానే అయిపోయింది అనుకుంటారు. కానీ చాలా ముఖ్యమైన మరో దశ ఉంటుంది. అది చేస్తేనే మీ రీఫండ్స్ ఏమైనా ఉంటే మీకు వస్తాయి. ఆ ప్రక్రియ ఈ-వెరిఫికేషన్. ఇది పూర్తయిన తర్వాతే మీ ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయినట్లుగా నిర్ధారణ అవుతుంది.

Income Tax: ఐటీఆర్ రిఫండ్ త్వరగా రావాలంటే ఈ ట్రిక్ పాటించండి.. మిస్ కాకండి..
Income Tax
Follow us on

పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏటా దీనిని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తుల ఆదాయం, ఖర్చుల వివరాలు అన్నమాట. ఈ ప్రక్రియ కాస్త సంక్లిష్టమే అయినా.. ఇటీవల కాలంలో దానిని ఆదాయ పన్ను శాఖ సరళీకృతం చేసింది. అయితే ఇది ఈ ప్రక్రియ మొత్తం బహుళ దశలలో ఉంటుంది. చాలా మంది ఐటీఆర్ ప్రక్రియ విజయవంతం అయ్యిందని చూపగానే అయిపోయింది అనుకుంటారు. కానీ చాలా ముఖ్యమైన మరో దశ ఉంటుంది. అది చేస్తేనే మీ రీఫండ్స్ ఏమైనా ఉంటే మీకు వస్తాయి. ఆ ప్రక్రియ ఈ-వెరిఫికేషన్. ఇది పూర్తయిన తర్వాతే మీ ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయినట్లుగా నిర్ధారణ అవుతుంది. వాస్తవానికి ఈ-వెరిఫికేషనే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో చివరి దశ.

ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ ఇలా..

  • ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి.
  • మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • “ఈ-ఫైల్” మెనుపై క్లిక్ చేసి, “ఈ-వెరిఫై రిటర్న్” ఎంచుకోండి.
  • మీ పాన్‌ను నమోదు చేయండి, అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంచుకోండి, ఫైల్ చేసిన ఐటీఆర్ రసీదు సంఖ్య, మీ వద్ద అందుబాటులో ఉన్న మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, కొనసాగించు క్లిక్ చేయండి.
  • మీరు ఉపయోగించాలనుకుంటున్న ఈ-ధృవీకరణ పద్ధతిని ఎంచుకోండి.
  • ఈ-ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి సూచనలను అనుసరించండి.

మరో మార్గంలో..

మీరు వీటిని ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఈ-వెరిఫై చేయవచ్చు. ఆధార్‌తో నమోదైన మొబైల్ నంబర్‌పై ఓటీపీ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ ఖాతా ద్వారా రూపొందించిన ఈవీసీ, ధ్రువీకరించిన డీమ్యాట్ ఖాతా ద్వారా రూపొందించిన ఈవీసీ, ఏటీఎం ద్వారా ఈవీసీ, నెట్ బ్యాంకింగ్, లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ).

ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది..

ఒకవేళ మీరు మీ రిటర్న్‌ని ఈ-వెరిఫికేషన్ పూర్తయితే లావాదేవీ ఐడీతో పాటు విజయవంతమైన సందేశం కనిపిస్తుంది. అలాగే ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేసుకున్న మీ ఈ-మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ పంపుతారు. అయతే ఈ-వెరిఫికేషన్ అనేది తప్పనిసరి కాదు. వాస్తవానికి ఈ-వెరిఫికేషన్ అనేది మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ ని ధ్రువీకరించే ఓ పద్దతి.

ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ..

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31, 2024. అయితే, కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ని తర్వాత ఫైల్ చేయడానికి అనుమతించబడతారు, ఉదాహరణకు, ఐటీఆర్-6ని ఎంచుకున్న వారు. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్లను ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖకు ఐటీఆర్ ఫారమ్ హార్డ్ కాపీని సమర్పించడం ద్వారా వారు తమ ఐటీఆర్ ఆఫ్‌లైన్‌లో కూడా ఫైల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..