Success Story: అమెరికాలో జాబ్ వదిలి.. స్వదేశంలో చెక్క వస్తువులతో సరికొత్త వ్యాపారం..

|

Aug 10, 2024 | 6:16 PM

విదేశాల్లో రూ. లక్షలు సంపాదిస్తూ కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరి ఇక్కడి వచ్చి ఓ చిన్న పర్యావరణ హితమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది ఒక రకంగా సాహసమనే చెప్పాలి. అయితే ఆ సాహసాన్ని ఆమె చేసి, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఏకంగా నెలకు రూ. లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్నారు. ఇంతకీ ఎవరామె?

Success Story: అమెరికాలో జాబ్ వదిలి.. స్వదేశంలో చెక్క వస్తువులతో సరికొత్త వ్యాపారం..
Jungle Bound
Follow us on

విదేశాల్లో ఉద్యోగం అనేది చాలా మంది యువతకు కల. ఎందుకంటే అధిక శాలరీలు ఉంటాయి. కుటుంబాన్ని బాగా సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందని భావన. అందుకే ఇక్కడి నుంచి అందరూ విదేశాల బాట పడుతుంటారు. అయితే ఓ యువతి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. విదేశాల్లో రూ. లక్షలు సంపాదిస్తూ కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరి ఇక్కడి వచ్చి ఓ చిన్న పర్యావరణ హితమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది ఒక రకంగా సాహసమనే చెప్పాలి. అయితే ఆ సాహసాన్ని ఆమె చేసి, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఏకంగా నెలకు రూ. లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్నారు. ఇంతకీ ఎవరామె? ఆమె చేసిన వ్యాపారం ఏమిటి? తెలుసుకుందాం రండి..

పుణేకి చెందిన యువతి..

పుణెకు చెందిన ప్రతీక్షా షెల్కే విదేశాల్లో ఉద్యోగాన్ని వదేలేసి మరి వచ్చి.. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ ను ప్రారంభించారు. అమెరికాలో నెలకు రూ. 4.5 లక్షలు సంపాదించే అధిక జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, షెల్కే భారత్‌కు తిరిగి వచ్చి మహారాష్ట్రలోని పూణేలోని శివనే వార్జే ప్రాంతంలో జంగిల్ బౌండ్ అనే తన సొంత సంస్థ స్థాపించారు.

మెకానికల్ ఇంజినీర్..

షెల్కే మెకానికల్ ఇంజినీర్. గతంలో యూఎస్ లో కార్లను ఉత్పత్తి చేసే కంపెనీలో పనిచేశారు. విదేశాల్లో విజయవంతమైన కెరీర్‌ని అందుకున్నప్పటికీ.. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి కొత్త వెంచర్‌లో తన నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. దానికి ఆమె కుటుంబం మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎంప్లాయిమెంట్ స్కీమ్ ద్వారా గ్రాంట్ మంజూరు కావడంతో జంగిల్ బౌండ్ అనే సంస్థను ప్రారంభించారు. కలప, వెదురుతో చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులలో ప్రత్యేకత కలిగిన ఫ్యాక్టరీ ఇది.

ఈ వస్తువుల తయారీ..

ఈ జంగిల్ బౌండ్ కంపెనీ కార్యాలయ సామగ్రి, గృహోపకరణాలు, కార్పొరేట్ బహుమతులు, ల్యాప్‌టాప్ స్టాండ్‌లు, మొబైల్ స్టాండ్‌లు, స్పీకర్‌ల వంటి వ్యక్తిగత ఉపకరణాలతో సహా అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ హ్యాండ్ కలప, వెదురును ఉపయోగించడం ద్వారా, కొత్త చెట్లను కత్తిరించే అవసరాన్ని నివారించడం ద్వారా ఫ్యాక్టరీ స్థిరత్వాన్ని నొక్కి చెబుతుంది.

అతి తక్కువ సమయంలోనే..

ప్రారంభించిన మూడు సంవత్సరాలలో, జంగిల్ బౌండ్ రూ. 50 లక్షల టర్నోవర్‌ను సాధించింది. పర్యావరణ బాధ్యతను వ్యాపార చతురతతో మిళితం చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అభిరుచి, అంకితభావం అద్భుతమైన విజయానికి ఎలా దారితీస్తాయో చెప్పడానికి షెల్కే ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా పనిచేస్తుంది. యువతకు ఆమె ఒక మార్గదర్శిగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..