సురక్షిత పెట్టుబడి పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) . ఇది అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పథకం. ఎందుకంటే దీనికి ప్రభుత్వం భరోసా ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఖాతాను ఏదైనా బ్యాంకులో లేదా పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు. 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా పీపీఎఫ్ లో ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టోచ్చు. ఖతా తెరవడానికి గరిష్ట వయో పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాలి. ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. దీనిపై 7.10శాతం వడ్డీ లభిస్తుంది. పైగా దీనిపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు ఒక వేళ కోటీశ్వరులు కావాలనుకొంటే ఈ పథకంలో ఖాతాను వెంటనే ప్రారంభించింది. కోటీశ్వరులు కావడం ఎలాగో మేము వివరిస్తాం..
పీపీఎఫ్ ఖాతాను ఏదైనా బ్యాంకులో గానీ లేదా పోస్టాఫీసులో గానీ రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఏడాదికి రూ. 500 అయినా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకసారి అయినా లేదా నెలకొకసారి చొప్పున 12 నెలలు కట్టుకోవచ్చు. ఈ పథకంలో చేరితే ఏడాదిలో డిపాజిట్ చేసే రూ. 1.50 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభించడం సహా మెచ్యూరిటీ సమయంలో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు దీనిని పొడిగించుకోవచ్చు. ఇలా అపరిమిత కాలానికి ఈ స్కీమ్ ను పొడిగించుకోవచ్చు.
పీపీఎఫ్ ఖాతాపై ప్రభుత్వం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే కోటీశ్వరులు అవ్వచ్చునని నిపుణులు అంటున్నారు. అదెలా అంటే పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత 3 దఫాలుగా 5 ఏళ్ళు చొప్పున పెంచుకోవచ్చు. అప్పుడు అదనంగా మరో 15 ఏళ్ళు పీరియడ్ ఉంటుంది. అంటే మొత్తం 30 ఏళ్ళు లాకిన్ పీరియడ్ పెట్టుకుంటే.. నెలకి ఇంత అని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మెచ్యూరిటీ సమయంలో కోటిన్నర పైనే పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..