ఎలక్ట్రిక్ కార్ల తయారీలో సంచలనం సృష్టించిన టెస్లా కంపెనీ.. తన మరో ఫీచర్ కారును లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మోడల్ 2 పేరుతో దీనిని వచ్చే ఏడాది ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ కంపెనీ ఇప్పటి వరకూ విడుదల చేసిన కార్లలో కెల్లా అత్యంత చవకైనదిగా మోడల్ 2 నిలవునుంది. దీని ధర దాదాపు 25,000 డాలర్లు ఉండే అవకాశం ఉంది.
ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ తన బ్రాండ్ న్యూ మోడల్ 2 కారును యూరోప్, ఆసియాలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయా ప్రాంతాలకు అనువైన కాంపాక్ట్ డిజైన్ తో దానిని తీసుకురానుంది. అయితే దానిని ఆ కంపెనీ ఈ ఏడాది లాంచ్ చేయకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో టెస్లా మోడల్ 3 కారు ఉంది. దీని ధర కాస్త ఎక్కువ. ఇప్పుడు ప్రకటించిన మోడల్ 2 దీని కన్నా చాలా తక్కువ ధరలో లభ్యమవుతుంది. దీంతో మోడల్ 2 మార్కెట్లోకి వస్తే దాని ప్రభావం మోడల్ 3 అమ్మకాలపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మోడల్ 2 ను ఆవిష్కరించి, 2025లో మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
చైనాలో టెస్లాకు చెందిన రెండు మోడల్ కార్లను చైనాలో లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ పేరిట వాటిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే వాటి ధరలు, స్పెసిఫికేషన్లు వచ్చే శుక్రవారం వెలువరిస్తామని ఆ కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..