EPFO Insurance: ప్రైవేటు ఉద్యోగులకూ ఉందో బీమా.. రూ. 7లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు..
ఆ ఉద్యోగి అనుకోకుండా చనిపోతే అతడి కుటుంబం పరిస్థితి ఏమిటి? అందుకే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) తన చందాదారులకు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు బీమా కవరేజ్ కల్పించింది. ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే అతడి నామినీకి రూ.7 లక్షలు అందజేస్తుంది.

ఒక సంస్థ లేదా ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి సాధారణంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ప్రతి నెలా ఆ ఉద్యోగి జీతంలోంచి కొంత మొత్తాన్ని అందులో జమ చేస్తారు. దీని వల్ల అతడు ఉద్యోగ విరమణ చేసినప్పుడు సొమ్ము అందుతుంది. అది అతడి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఆ ఉద్యోగి అనుకోకుండా చనిపోతే అతడి కుటుంబం పరిస్థితి ఏమిటి? అందుకే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) తన చందాదారులకు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు బీమా కవరేజ్ కల్పించింది. ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే అతడి నామినీకి రూ.7 లక్షలు అందజేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈడీఎల్ఈ పథకం ఇలా..
ఈడీఎల్ఈ అనేది ఉద్యోగులకు కాంప్లిమెంటరీ బీమా పథకంలా పనిచేస్తుంది. ఒకవేళ నామినీ లేనప్పుడు అతడి చట్టబద్దమైన వారసులకు బీమా సొమ్మును సమానంగా పంపిణీ చేస్తారు. ఉద్యోగికి అనారోగ్యం కలిగినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు, మరణించినప్పుడు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
ఎంత మొత్తం వస్తుందంటే..
ఈ పథకం కింద లభించే ప్రయోజనాన్ని ఉద్యోగి గత 12 నెలల జీతంగా ఆధారంగా నిర్ణయిస్తారు. ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ గత 12 నెలల జీతం కంటే 30 రెట్లు పొందుతారు. దానికి అదనంగా 20 శాతం బోనస్ కలుపుతారు. ఉద్యోగి జీతం నుంచి ప్రతినెలా మినహాయించే సొమ్ములో 8.3 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కు, 3.67 శాతం ఈపీఎఫ్ కు, 0.5 శాతం ఈడీఎల్ఐకి కేటాయిస్తారు.
ఖాతాదారుడి బీమా కవరేజీ నుంచి లబ్ధిదారులు కనిష్టంగా రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షలు పొందవచ్చు. అయితే ఆ ఉద్యోగికి 12 నెలల పాటు నిరంతరంగా ఆ సంస్థలో పనిచేస్తూ ఉండాలి. ఖాతాదారుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మాత్రమే బీమా పథకం వర్తిస్తుంది. అప్పుడే నామినీకి పథకం కింద సొమ్మును అందిస్తారు. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగి చనిపోతే ఈ పథకం ప్రయోజనాలు అందవు. అలాగే ఈ బీమా పథకం వల్ల పీఎఫ్ ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
రక్షణ కవచం..
ఉద్యోగులు, వారి కుటుంబాలకు రక్షణ వలంగా ఈడీఎల్ఐ పథకం పనిచేస్తుంది. ఊహించని పరిస్థితులు, అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఈపీఎఫ్ చందాదారులందరూ ఈ పథకం ప్రయోజనాలు, నిబంధనలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా దానిని సద్వినియోగం చేసుకునే వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








