2024 Bajaj pulsar NS125: కొత్త లుక్లో యువత కలల బైక్.. ఆకట్టుకునే స్టైల్.. అదరగొడుతున్న 2024 పల్సర్..
డిజైన్ పరంగా పల్సర్ ఎన్ఎస్ 125 మోడల్ బండిని ఆధునికంగా తీర్చిదిద్దారు. గత వాహనాలకు భిన్నంగా అప్ డేట్ చేసిన హెడ్ ల్యాంప్ ను ఏర్పాటు చేశారు. దీని కేసింగ్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. అందమైన డిజైన్, పెట్రోలు ట్యాంకుతో అద్భుతంగా రూపొందించారు. స్పోర్టివ్ లుక్ తో ఆకర్షణీయంగా ఉంది. రెండు భాగాల సీటు దీనికి వెనుక వైపు నుంచి ఎంతో అందాన్ని పెంచింది.

బజాజ్ ఆటో సంస్థ మార్కెట్ లోకి విడుదల చేసే పల్సర్ బైక్ లకు ఎంతో క్రేజ్ ఉంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచీ వీటికి ఆదరణ లభిస్తుంది. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే కొత్త మోడల్ మోటారు సైకిళ్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ 2024లో తమ వాహనాలను ప్రదర్శన పరంగా, ఫీచర్స్ పరంగా బాగా అప్ డేట్ చేసింది. ముఖ్యంగా పల్సర్ ఎన్ఎస్ 125 మోడల్ ను అనేక రకాలుగా అప్ డేట్ చేసి ఆవిష్కరించింది.
చిన్న మోడల్..
బజాజ్ సంస్థ తన పల్సర్ వాహనాలను నవీకరణ చేస్తోంది. ఎన్ఎస్ 200, ఎన్ఎస్ 160 మోడళ్లతో పాటు ఎన్ఎస్ 125 మోడల్ బండ్లలో అనేక మార్పులకు చర్యలు చేపట్టింది. కొత్త మోడల్ ఎన్ఎస్ 125 బండి కేవలం రూ.1.05 లక్షలకే లభిస్తోంది. గత మోడళ్లతో పోల్చితే ఇది కేవలం రూ.5 వేలు మాత్రమే ఎక్కువ. ఇక ఎన్ఎస్ సిరీస్ లో స్మాలెస్ట్ మోడల్ గా దీనిని చెప్పుకోవచ్చు.
డిజైన్ ఇలా..
డిజైన్ పరంగా పల్సర్ ఎన్ఎస్ 125 మోడల్ బండిని ఆధునికంగా తీర్చిదిద్దారు. గత వాహనాలకు భిన్నంగా అప్ డేట్ చేసిన హెడ్ ల్యాంప్ ను ఏర్పాటు చేశారు. దీని కేసింగ్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. అందమైన డిజైన్, పెట్రోలు ట్యాంకుతో అద్భుతంగా రూపొందించారు. స్పోర్టివ్ లుక్ తో ఆకర్షణీయంగా ఉంది. రెండు భాగాల సీటు దీనికి వెనుక వైపు నుంచి ఎంతో అందాన్ని పెంచింది. బైక్ ముందు భాగాన్ని పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంటేషన్ గా తీర్చిదిద్దారు. గతంలో సెమీ డిజిటల్ గా ఉండేది. ఈ బైక్ లో కొత్తగా కనెక్టివిటీ ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో కాల్స్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు కనిపించేలా అప్ డేట్ చేశారు. అయితే ఇది టర్న్ బై టర్న్ నేవిగేషన్ ను మాత్రం కోల్పోతుంది.
స్పెసిఫికేషన్లు ఇలా..
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 వాహనం 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పని చేస్తుంది. 11.8 బీహెచ్ పీ అలాగే 11 ఎంఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఐదు గేర్లతో సౌకర్యవంతంగా పని చేస్తుంది. బైక్ లోని హార్డ్ వేర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్ లు, మోనో షాక్, ముందు సింగిల్ డిస్క్ బ్రే క్, వెనుక డ్రమ్ బ్రేక్ అలాగే ఉంటాయి. ఇన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ ధర సామన్యులకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో టీవీ ఎస్ రైడర్ 125, హీరో ఎక్స్ ట్రీమ్ 125 ఆర్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. పల్సర్ శ్రేణిలో ఇతర మోడల్ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం. వాటిలో పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 బళ్లు వరుసగా 160.33 సీసీ, 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ మోటారు కలిగి ఉంటాయి. అలాగే ఎన్ఎస్ 160 మోడల్ 17.03 బీహెచ్ పీ, 14.6 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ ఎన్ఎష్ 200 మోడల్ 24.16 బీహెచ్ పీ, 18.74 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








