Post Office Scheme: రూ.3లక్షల పెట్టుబడిపై రూ. 1.34లక్షల వడ్డీ.. పైగా పన్ను ప్రయోజనాలు..

|

Jun 30, 2024 | 4:31 PM

పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలలో పెట్టుబడి పెడతారు. దీనిలో సాధారణ పౌరులకు అందించే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటును కూడా అందిస్తాయి. పోస్టాఫీసులు, బ్యాంకులు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వివిధ కాల వ్యవధిలో ఎఫ్డీ పథకాలను అమలు చేస్తాయి. పోస్టాఫీసు ఎఫ్డీని నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (టీడీ) అని కూడా అంటారు.

Post Office Scheme: రూ.3లక్షల పెట్టుబడిపై రూ. 1.34లక్షల వడ్డీ.. పైగా పన్ను ప్రయోజనాలు..
Post Office Scheme
Follow us on

పోస్ట్ ఆఫీసు పథకాలకు భద్రత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ భరోసా దొరకుతుంది. అందుకే ప్రజలకు ఆ పథకాలపై నమ్మకం ఉంటుంది. అందకనుగుణంగానే అనేక ప్రజాప్రయోజన పథకాలను పోస్ట్ ఆఫీసు అందిస్తూ ఉంటుంది. వాటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్డీ) ఒకటి. చిన్న పొదుపు, గ్యారెంటీ రిటర్న్ స్కీమ్, ఇక్కడ ఒకేసారి పెట్టే పెట్టుబడిపై రాబడి వస్తుంది. మార్కెట్-లింక్డ్ ప్రోగ్రామ్‌లలో పెట్టుబడి పెట్టకూడదనుకునేవారికి, రిస్క్ అస్సలు వద్దూ అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలలో పెట్టుబడి పెడతారు. దీనిలో సాధారణ పౌరులకు అందించే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటును కూడా అందిస్తాయి. పోస్టాఫీసులు, బ్యాంకులు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వివిధ కాల వ్యవధిలో ఎఫ్డీ పథకాలను అమలు చేస్తాయి. పోస్టాఫీసు ఎఫ్డీని నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (టీడీ) అని కూడా అంటారు.

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (టీడీ)..

ఈ పథకం 1-సంవత్సరం, 2-సంవత్సరాల, 3-సంవత్సరాలు, 5-సంవత్సరాల కాల వ్యవధుల్లో అందుబాటులో ఉంటుంది. ఐదేళ్ల కాలవ్యవధితో కూడిన టీడీలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌లపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

పోస్టాఫీసు ఎఫ్డీలలో వడ్డీ రేట్లు ఇలా..

పోస్టాఫీసు ఎఫ్డీలో ఒకరు లేదా ఉమ్మడి ఖాతా (3 మంది పెద్దలు వరకు) కలిగి ఉండవచ్చు. మైనర్ తరపున ఒక సంరక్షకుడు, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరఫున సంరక్షకుడు, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ వారి సొంత పేరు మీద ఖాతాను తెరవవచ్చు. వడ్డీ వార్షికంగా కానీ త్రైమాసికంగా అందిస్తారు. దీనిలో కనీస పెట్టుబడి రూ. 1,000 ఉంటుంది. రూ. 100 గుణిజాలలో గరిష్టంగా ఎంతైన పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకాల్లో రాబడి ఇలా..

1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో..

  • వడ్డీ రేటు 6.9 శాతం. దీనిలో రూ.లక్ష పెట్టుబడి మీకు రూ.7,081 వడ్డీని, రూ.1,07,081 మెచ్యూరిటీని ఇస్తుంది.
  • రూ. 2 లక్షల పెట్టుబడి మీకు తిరిగి రూ. 14,161 మరియు మెచ్యూరిటీలో రూ. 2,14,161 ఇస్తుంది.
  • రూ.3 లక్షల పెట్టుబడి తిరిగి రూ.21,242, మెచ్యూరిటీ రూ.3,21,242 ఇస్తుంది.

2 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో..

  • వడ్డీ రేటు 7.0 శాతం. రూ. 1 లక్ష పెట్టుబడి మీకు రూ. 14,888 వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 1,14,888 ఇస్తుంది.
  • రూ. 2 లక్షల పెట్టుబడికి రూ. 29,776 వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 2,29,776 ఇస్తుంది.
  • రూ. 3 లక్షల పెట్టుబడి మీకు తిరిగి రూ. 44,665 వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 3,44,665 ఇస్తుంది.

3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో..

  • వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. రూ. 1 లక్ష పెట్టుబడి మీకు రూ. 23,508 వడ్డీతో రూ. మెచ్యూరిటీ సయయానికి 1,23,508 ఇస్తుంది.
  • రూ.2 లక్షల పెట్టుబడి మీకు రూ.47,015 వడ్డీతో మెచ్యూరిటీ సయయానికి రూ.2,47,015 ఇస్తుంది.
  • రూ. 3 లక్షల పెట్టుబడిపై రూ. 70,523 వడ్డీతో మెచ్యూరిటీ సయయానికి రూ. 3,70,523 ఇస్తుంది.

5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో..

  • వడ్డీ రేటు 7.5 శాతం. రూ. 1 లక్ష పెట్టుబడి మీకు రూ. 44,995 వడ్డీతో కలుపుకొని రూ. 1,44,995 మెచ్యూరిటీని ఇస్తుంది.
  • రూ. 2 లక్షల పెట్టుబడి మీకు రూ. 89,990 వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 2,89,990 ఇస్తుంది.
  • రూ. 3 లక్షల పెట్టుబడి మీకు రూ. 1,34,984 వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 4,34,984 ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..