Home Loan Interest Rates: ఆ బ్యాంకుల్లో కారుచౌకగా గృహ రుణాలు.. ఇల్లు కొనాలనుకునేవారు మిస్ చేసుకోకండి..

|

Jul 07, 2024 | 3:44 PM

రిజర్వ్ బ్యాంక్ సెట్ చేసిన లోన్ టు వాల్యూ రేషియో(ఎల్టీవీ) ప్రకారం బ్యాంకులు రుణాన్ని అందిస్తాయి. ఇది మీ ఆస్తి ధర శాతాన్ని నిర్ణయిస్తుంది. తద్వారా మీకు ఎంత రుణం అనేది నిర్ణయిస్తారు. అంతేకాక ఎల్టీవీ నిష్పత్తితో పాటు రుణగ్రహీత ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం, వయస్సు, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్ వంటివి కూడా రుణ ఆమోదాన్ని ప్రభావితం చేస్తాయి.

Home Loan Interest Rates: ఆ బ్యాంకుల్లో కారుచౌకగా గృహ రుణాలు.. ఇల్లు కొనాలనుకునేవారు మిస్ చేసుకోకండి..
Bank Home Loan
Follow us on

ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం అనేది జీవితంలోని అతి పెద్ద ఆర్థిక నిర్ణయం. ఎందుకంటే అది భారీ బడ్జెట్ తో కూడుకున్నది. చిన్న మొత్తాలతో దానిని సాధించలేం. అందుకే ఇటీవల కాలంలో అందరూ హోమ్ లోన్(గృహ రుణాలు)లను ఎంచుకుంటున్నారు. తక్కువ వడ్డీ ఉండటం, తేలికపాటు మొత్తాలలో ఈఎంఐ చెల్లించుకునే వెసులుబాటు కారణంగా అందరూ హోమ్ లోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వ్యవధి వరకూ సులభ వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు బ్యాంకులు లేదా ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఈ రుణాలు రిజర్వ్ బ్యాంక్ సెట్ చేసిన లోన్ టు వాల్యూ రేషియో(ఎల్టీవీ) ప్రకారం బ్యాంకులు రుణాన్ని అందిస్తాయి. ఇది మీ ఆస్తి ధర శాతాన్ని నిర్ణయిస్తుంది. తద్వారా మీకు ఎంత రుణం అనేది నిర్ణయిస్తారు. అంతేకాక ఎల్టీవీ నిష్పత్తితో పాటు రుణగ్రహీత ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం, వయస్సు, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్ వంటివి కూడా రుణ ఆమోదాన్ని ప్రభావితం చేస్తాయి.

కాగా ఇటీవల పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించాయి. వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి టాప్ ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ప్రస్తుత వడ్డీరేట్లను మీకు అందిస్తున్నాం.

ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు..

ఐసీఐసీఐ బ్యాంక్ 8.4శాతం నుంచి 9.45శాతం వరకూ వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో ఒకశాతం ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా చెల్లంచాల్సి రావొచ్చు.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు..

ఈ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.60 నుంచి 9.50శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.50శాతం లేదా రూ. 3,000, ఏది ఎక్కువ అయితే అది ఉంటుంది. అదనంగా జీఎస్టీ యాడ్ అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు..

ఈ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేట్లు శాలరీడ్ వ్యక్తులకు 8.75శాతం, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు 9.10శాతం నుంచి ప్రారంభమవుతాయి. ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 2,500 ప్లస్ జీఎస్టీతో పాటు లోన్ మొత్తంలో ఒక శాతం కనిష్టంగా రూ. 10,000 వరకూ ఉంటుంది.

హోమ్ లోన్ పై పన్ను ప్రయోజనాలు..

మీరు హోమ్ లోన్ తీసుకుంటే పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24బీ కింద చెల్లించిన వడ్డీపై మినహాయింపును క్లయిమ్ చేసుకోవచ్చు. అదనంగా మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ పై మినహాంయిపు పొందొచ్చు. మీరు నిర్మిస్తున్న ప్రాపర్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఆస్తిని ఐదేళ్ల విక్రయిస్తే.. ఈ ప్రయోజనం రివర్స్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..