Electric Scooter: రూ. లక్ష లోపు ధరలో అదిరే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఇప్పుడే టెస్ట్‌ రైడ్‌ చేయండి..

|

Jun 05, 2023 | 11:59 AM

Lectrix EcityZip Electric Scooter: లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ పేరుతో ఈ బైక్‌ కేవలం రూ. 1 లక్షలోపు బడ్జెట్‌ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇది పూర్తి పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణాల్లో, సమర్థమైన రవాణా వ్యవస్థ కావాలనుకొనేవారికి ఆప్షన్‌ కాగలదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Electric Scooter: రూ. లక్ష లోపు ధరలో అదిరే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఇప్పుడే టెస్ట్‌ రైడ్‌ చేయండి..
Lectrix Ecity Zip
Follow us on

మన దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. పూర్తి పర్యావరణ హితం కావడం, మంచి మైలేజీని సింగిల్‌ చార్జ్‌ అందిస్తుండటంతో పాటు నిర్వహణ చాలా సులభంగా ఉండటంతో అందరూ ఈ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అర్బన్‌ వినియోగదారులు, సిటీ పరిధిలో కుటుంబ అవసరాలకు వీటికి అధికంగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. అయితే వినియోగదారులు వాటి పనితీరు, మైలేజీతో పాటు వాటి ధరను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ పేరుతో ఈ బైక్‌ కేవలం రూ. 1 లక్షలోపు బడ్జెట్‌ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇది పూర్తి పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణాల్లో, సమర్థమైన రవాణా వ్యవస్థ కావాలనుకొనేవారికి ఈ లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ బెస్ట్‌ ఆప్షన్‌ కాగలదు. ఈ నేపథ్యంలో లెక్ట్రిక్స్ ఈసిటీజిప్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సామర్థ్యం ఇలా..

లెక్ట్రిక్స్ ఈసిటీజిప్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లో 250W మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అలాగే  సింగిల్‌ ఛార్జ్‌పై గరిష్టంగా 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. స్కూటర్‌లో 48V/24Ah లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని 6-7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌..

ఈ స్కూటర్ తేలికైన, మన్నికైన ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది ట్రాఫిక్‌లో చాలా సులభంగా రైడ్‌ చేయవచ్చు. ఇరుకైన ప్రదేశాలలో నావిగేట్ చేయడం సులభం చేస్తుంది. సౌకర్యవంతమైన సీటు, సీటు కింద తగినంత నిల్వ స్థలం ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు అనువైనదిగా చేస్తుంది. స్కూటర్ వేగం, బ్యాటరీ స్థాయి మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని చూపే డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్‌ను కూడా కలిగి ఉంది. అదనంగా, దీనికి ముందు, వెనుక సస్పెన్షన్ సిస్టమ్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..