మనిషి అవసరాలు మారిపోయాయి. ఇప్పుడు ప్రతి కుటుంబలో ఓ రిఫ్రిజిరేటర్ ఉండాల్సిందే. వంటగదిలో ఫ్రిడ్జ్ లేని కుటుంబాన్ని ప్రస్తుత కాలంలో మనం చూడలేమనే చెప్పాలి. పైగా వేసవి వేడిమి పెరిగిపోతోంది. ఫలితంగా ఇంట్లోని ఆహార పదార్థాలు, కూరగాయలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అందరి దృష్టి రిఫ్రిజిరేటర్ వైపే ఉంటుంది. బడ్జెట్ ధరల్లో మంచి ఫీచర్లు ఉన్న ఫ్రిజ్ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే మార్కెట్లో చాలా రకాల ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డోర్, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్, ఫ్రెంచ్ డోర్లతో పాటు హై ఎండ్ ఫీచర్లతో ఆకర్షిస్తున్నాయి.
అయితే మన బడ్జెట్, మన కుటుంబ అవసరాలను బట్టి రిఫ్రిజిరేటర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ కూరగాయాలు, ఇతర వస్తువులు పెట్టుకునేందుకు విశాలంగా ఉండాలని కోరుకుంటే మీకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎక్కువ మొత్తంలో సరకులు నిల్వ చేసుకోవచ్చు. దీనికి రెండు డోర్లు ఉండటం వల్ల ఫ్రీజర్, ఫ్రిజ్ సెక్షన్ సపరేటుగా ఉంటుంది. స్టోరేజీ కెపాసిటీ ఎక్కువ. ఫ్రీజర్ వాడుకోవాలంటే ఫ్రిజ్ సెక్షన్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు 235 నుండి 495 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్ల్‌పూల్ 231లీటర్లు 2 స్టార్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. మీరు భారతదేశంలో అత్యుత్తమ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్ మీకు బెస్ట్ చాయిస్. దీనిలో ఉన్న ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఫలితంగా ప్రత్యేక స్టెబిలైజర్ అవసరం దీనికి ఉండదు. గణనీయమైన వోల్టేజ్ హెచ్చుతగ్గుల (160-260V)లో కూడా ఇది స్థిరంగా పనిచేస్తుంది. ఇందులో పెట్టే పండ్లు, కూరగాయలను 15 రోజుల వరకూ తాజాగా ఉంచుతుంది. దీని ధర రూ. 23290గా ఉంది.
ఎల్‌జీ 242 లీటర్ల 3 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. దీనిలో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. చాలా తక్కువ శబ్దంతో ఇది పనిచేస్తుంది. తక్కువ కరెంట్ ను తీసుకుంటుంది. దీనిలో డోర్ కూలింగ్+ అనే కొత్త సాంకేతికతను వినియోగించారు. ఫలితంగా డోర్ ఏరియాలో మెరుగైన శీతలీకరణ సాధ్యమవుతుంది. దీనిలో అనేక కూలింగ్ వెంట్ లు ఉన్నాయి. దీని ధర మార్కెట్లో రూ. 24990గా ఉంది.
శామ్సంగ్ 324 లీటర్ల 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఈ శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్‌లో ఆటోమేటిక్ ఐస్ బిల్డ్ అప్ అవ్వకుండా ఆటో డీఫ్రాస్ట్ సిస్టమ్ ఉంది. ఇది గరిష్టంగా 3-5 మంది సభ్యుల కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్ ధర రూ. 34490.
శామ్సంగ్ 322 లీటర్ల 2 స్టార్ కన్వర్టిబుల్ 5 ఇన్1 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఈ రిఫ్రిజిరేటర్ ఐదు కన్వర్షన్ మోడ్‌లను అందిస్తుంది. మీకు అవసరమైన అన్ని కూలింగ్ డిమాండ్‌లను తీర్చడానికి ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఈ ట్విన్ కూలింగ్ ప్లస్ సాంకేతికత కారణంగా రిఫ్రిజిరేటర్, ఫ్రీజర్ రెండింటికీ ప్రత్యేకమైన గాలి ప్రవాహాలను అందిస్తుంది. బటన్‌ను నొక్కినప్పుడు పవర్ ఫ్రీజ్‌తో ఐస్ 31% మరింత త్వరగా తయారు చేస్తోంది. మొబైల్ ఐస్ మేకర్ ఆపరేట్ చేయడం సులభం. శాంసంగ్ రిఫ్రిజిరేటర్ ధర రూ. 35,990గా ఉంది.
లాయిడ్ 340 లీటర్ల 2 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఈ లాయిడ్ ఫ్రిజ్ ధర, ఫీచర్ల పరంగా భారతదేశంలోని అత్యుత్తమ రిఫ్రిజిరేటర్లలో ఒకటి . దీనిలో మరింత స్థిరమైన ఉష్ణోగ్రతను అందించే ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది. ఇది సాధారణ రిఫ్రిజిరేటర్ కంటే తక్కువ విద్యుత్ ను వినియోగిస్తుంది. చాలా తక్కువ శబ్దం చేస్తుంది. ఈ లాయిడ్ రిఫ్రిజిరేటర్ ధర రూ. 34490గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..