స్నేహితులతో సరదాగా మాట్లాడుకొనే సందర్భంలో తక్కువ సమయంలో కోట్లు కూడబెట్టాలిరా.. ఐదేళ్లలో లక్షాధికారి కావాలిరా అంటూ శపథాలు చేస్తూ ఉంటాం. అయితే ఆ శపథాలు ఆరోజుకి, నవ్వుకునేందుకు మాత్రమే సరిపోతాయి. అయితే మంచి బిజినెస్ ఐడియా, సరైనా ప్లానింగ్, ప్లానింగ్ కు తగ్గా శ్రమ, ఎగ్జిక్యూషన్ ఉంటే ఇది సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నిజమే మీరు కూడా అతి తక్కువ సమయంలో లక్షాధికారి కావొచ్చు. అది కూడా రూ. లక్షతోనే. కేవలం ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకోసం మీకు అవసరమైనదల్లా ఏంటంటే కాస్త ఓపిక. అవునండీ ఓపిక, దానికితోడు కష్టం ఉంటే ఈ బిజినెస్ లో రాణించడం సులువు. అప్పుడు ఆ బిజినెస్ మీ గురించి ప్రపంచం మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఏంటా బిజినెస్? తెలుసుకుందాం రండి..
నిన్నమొన్నటి వరకూ టామోటా ధర ఆకాశన్నంటింది. కేజీ రూ. 200 వరకూ కూడా వెళ్లింది. దీంతో సామాన్యులు టమోటాను కొనుగోలు చేయడం తగ్గించేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మామూలు స్థితికి వస్తోంది. టమోటా ధర అంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా రెస్టారెంట్లు, హోటళ్లులో రేట్లు పెంచకుండా అదే రేటుకి టమోటాతో తయారు చేసే కూరలు, గ్రేవీ కర్రీలు ఎలా ఇవ్వగలిగారు? ఎప్పుడైనా ఆలోచించారా? వారేమైనా టమోటాలు తయారు చేస్తారా? లేదు కదా మరెలా సాధ్యమైంది? సింపుల్ టామోటాల స్థానంలో వారు టమోటా ప్యూరీని వినియోగిస్తారు. ఏంటి.. టమోటా ప్యూరీ అనే పదాన్నే మొదటి సారి వింటున్నారా? పదం మీరు వినడం మొదటి సారేమో గానీ హోటళ్లు, రెస్టారెంట్లలో ఇది తరచూ వినియోగిస్తారు. ఈ టమోటా ప్యూరీ అంటే ఏమిటంటే టమోటాలను పేస్ట్ చేసి భద్రపరుచుకోవడం, అవసరం అయినప్పుడు కూరలు, సాస్ లలో మిక్స్ చేయడం అంతే. ఈ బిజినెస్ కు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. చిన్న స్టార్టప్ లా కేవలం రూ. లక్షతో దీనిని ప్రారంభించవచ్చు. నెమ్మదిగా వ్యాపారం వృద్ధి చెందుతుంది. క్రమక్రమంగా వ్యాపారాన్ని అప్ గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఐదేళ్లలో మిలియనీర్ కావొచ్చు.
టమోటా ప్యూరీ తయారు చేసే కంపెనీ నుంచి చిన్న ప్రాంఛైజీ తీసుకోండి. తక్కువ పెట్టుబడితో దీనిని ప్రారంభింవచ్చు. ఈ సమయంలోనే మీరు హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మీకు లాభాల మార్జిన్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే 1 సంవత్సరం పాటు కస్టమర్ల కోసం నిరంతరం వెతకడం ద్వారా మార్కెట్ మొత్తం మీ నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడు తక్కువగా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఎవరు ఎంత కొనుగోలు చేస్తున్నారు? వారికి ఏ నాణ్యత కావాలో కూడా మీకు తెలుస్తుంది. ఇలా రెండు సంవత్సరాలు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..