Savings Account: మీ బ్యాంక్ అకౌంట్ గురించి మీకు తెలియని విషయాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు!

|

Mar 27, 2023 | 1:00 PM

అందరూ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉంటున్నారు. ఎక్కువ మంది క్యాష్ దాచుకోవడం.. అవసరం అయినప్పుడు తీసుకోవడం మాత్రమే చేస్తుంటారు. అయితే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో అంతకు మించిన ఫీచర్లు చాలా ఉన్నాయి. వాటిని ఎవరూ సక్రమంగా వినియోగించుకోరు.

Savings Account: మీ బ్యాంక్ అకౌంట్ గురించి మీకు తెలియని విషయాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు!
Savings
Follow us on

ప్రస్తుత కాలంలో సేవింగ్స్ అకౌంట్ లేని వారు ఎవరూ ఉండటం లేదు. అందరూ బ్యాంకు లేదా, పోస్ట్ ఆఫీసుల్లో ఖాతా కలిగి ఉంటున్నారు. ఎక్కువ మంది క్యాష్ దాచుకోవడం.. అవసరం అయినప్పుడు తీసుుకోవడం మాత్రమే చేస్తుంటారు. అయితే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో అంతకు మించిన ఫీచర్లు చాలా ఉన్నాయి. వాటిని ఎవరూ సక్రమంగా వినియోగించుకోరు. ఈ నేపథ్యంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ద్వారా వచ్చే అదనపు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

అత్యవసర నిధి.. మన జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరికీ తెలీదు. అన్ని మనం ఊహించినట్లు జరగవు. అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగితే మీకు భరోసా ఇస్తుంది ఈ అత్యవసర నిధి. ఒకవేళ అనుకోని విధంగా మీ జాబ్ పోయినా.. వైద్య పరమైన ఖర్చులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటిని మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వినియోగించుకోవచ్చు. మీ డెబిట్ కార్డుల నుంచి దీనిని విత్ డ్రా చేయవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల నుంచే కొంత మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో పొదుపు చేయండి.

ఆర్థికపరమైన లక్ష్యాలను సాధించడానికి.. జీవితంలో కొన్ని లక్ష్యాలను మనం నిర్ధేశించుకుంటాం. ఆర్థికంగా బాగా స్థిరపడాలని, మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలి.. పిల్లల కోసం బాగా సంపాదించాలని, లేదా ఫ్యామిలీతో కలిసి ఏదైనా దూరప్రాంతం వెళ్లిరావాలని, లేదా ఏదైనా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనలు ఉంటాయి. వాటిన్నంటిని ఫుల్ ఫిల్ చేసేందుకు పొదుపు చాలా అవసరం. అందుకే మీ సేవింగ్స్ ఖాతాను చాలా తెలివిగా వినియోగించుకోవాలి. మీ లక్ష్యాల మేరకు సేవింగ్స్ ఖాతాలో పొదుపు చేయాలి.

ఇవి కూడా చదవండి

మీ సేవింగ్స్ వడ్డీ.. మీరు సేవింగ్స్ ఖాతాలో డబ్బులు వేస్తే మీకు బ్యాంకులు వడ్డీని అందిస్తాయి. ప్రస్తుతం ఐడీఎఫ్సీ బ్యాంకు మీ సేవింగ్స్ పై అత్యధికంగా 6.75 వరకూ వడ్డీని అందిస్తోంది. అది కూడా నెలవారీ మీ ఖాతాలో వడ్డీని జమ చేస్తోంది. చాలా బ్యాంకులు క్వార్టర్లీగా వడ్డీని జమచేస్తాయి.

సులభంగా లావాదేవీలు.. మీరు సేవింగ్స్ ఖాతాలో వేసిన నగదును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేయొచ్చు. అందుకోసం ఏటీఎం, ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లేద బ్యాంకు వెళ్లి మీ ఖతాను నిర్వహించవచ్చు. ఈ ఖాతా నుంచే మీరు ఇతర పథకాలలో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు.

సురక్షితం.. మీరు మీ సేవింగ్స్ ఖాతాలో రూ. 5లక్షల వరకూ వేసే డిపాజిట్లను డిపాజిట్ ఇన్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) సంరక్షిస్తుంది. ఒకవేళ బ్యాంకుల డిఫాల్ట్ సమయంలోనూ ఇవి మీ సొమ్మును భద్రంగా మీకు అందిస్తాయి.

డెబిట్ కార్డు ఆఫర్స్.. సేవింగ్స్ ఖాతా ద్వారా చేసే లావాదేవీలపై వివిధ ఆఫర్లు కూడా ఉంటాయి. వివిధ రకాల వ్యాపారులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లావాదేవీలపై వివిధ రకాల డిస్కౌంట్లు అందిస్తారు. అలాగే డెబిట్ కార్డ్ లావాదేవీలపైనా పలు ఆఫర్లు ఉంటాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ఆయా కార్డులపై ఆఫర్లు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..