ఈ టైంలో బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలేంటి..?

| Edited By:

Sep 15, 2019 | 5:48 PM

ఒకానొక దశలో బంగారం ధరలు ఆకాశానికెక్కి కూర్చొన్నాయి. దాదాపు 40 వేలకు పైగా బెంజ్ మార్క్‌ దాటి.. ఆల్‌ టైం రికార్డుగా నిలిచాయి. ఆగష్టు 27 తరువాత 40వేల రూపాయలకు పైగా పెరిగాయి. దీంతో.. బంగారం కొనేవాళ్లకి.. నిరాశ ఎదురైంది. పసిడి ధరలు పెరగడంతో.. కొనుగోళ్లు తగ్గాయి. ఆషాడ మాసంలోనే.. వినియోగదారులకు చుక్కలు చూపించాయి పసిడి ధరలు. అప్పుడే.. తగ్గుతుందని అందరూ.. ఎక్స్‌పెక్ట్ చేసినా.. వారికి షాక్‌నిస్తూ.. కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చాయి. నిజానికి.. ఆషాడ మాసంలో.. శ్రావణ […]

ఈ టైంలో బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలేంటి..?
Follow us on

ఒకానొక దశలో బంగారం ధరలు ఆకాశానికెక్కి కూర్చొన్నాయి. దాదాపు 40 వేలకు పైగా బెంజ్ మార్క్‌ దాటి.. ఆల్‌ టైం రికార్డుగా నిలిచాయి. ఆగష్టు 27 తరువాత 40వేల రూపాయలకు పైగా పెరిగాయి. దీంతో.. బంగారం కొనేవాళ్లకి.. నిరాశ ఎదురైంది. పసిడి ధరలు పెరగడంతో.. కొనుగోళ్లు తగ్గాయి. ఆషాడ మాసంలోనే.. వినియోగదారులకు చుక్కలు చూపించాయి పసిడి ధరలు. అప్పుడే.. తగ్గుతుందని అందరూ.. ఎక్స్‌పెక్ట్ చేసినా.. వారికి షాక్‌నిస్తూ.. కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చాయి. నిజానికి.. ఆషాడ మాసంలో.. శ్రావణ మాసంలో.. పెళ్లిళ్లు సీజన్‌ కాబట్టి.. చాలా వరకూ బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతాయి.

కేంద్రం.. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టినప్పుడే.. బంగారం ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇక ఆ తరువాత రోజు నుంచే.. బంగారం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో.. పాటుగా వెండి ధరలు కూడా ఆల్‌టైం రికార్డును సాధించాయి. ఇక ఆగష్టు 27వ తేదీన.. పసిడి 40 వేల మార్క్‌ను దాటింది. వెండి కూడా.. 49 వేలు దాటింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారులు నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే.. అందరూ ఊహించినట్టు.. బంగారం ధరలు ఇంకా పైపైకి ఎగబాకి.. అర లక్షకి చేరుకుంటుందని.. అనుకున్నారు. కానీ.. వినూత్నంగా అది కొద్ది కొద్దిగా తగ్గుతూ.. వస్తుంది. తాజాగా.. ఈ రోజు.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర, 10 గ్రాములు రూ.38,700లుగా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం, 10 గ్రాములు రూ.35,840లుగా ఉంది. 22 క్యారెట్స్ ఒక గ్రాము రూ.35,840లు కాగా.. 24 క్యారెట్స్ ఒక గ్రాము రూ.3,870లుగా ఉంది.

కాగా.. బంగారం ధర అసలు ఎందుకు తగ్గడానికి గల కారణాలేంటని.. అందరూ అనుకుంటూంటారు కదా..! మరి అవేంటో తెలుసుకుందామా..!

1. సాధారణంగానే.. బంగారం ధరలు పెరిగితే.. వినియోగదారులు కాస్త దూరంగా ఉంటారు. దీంతో.. డిమాండ్ పడిపోతుంది. గోల్డ్ షాప్ యజమానులకు సప్లై తగ్గుతుంది. అలాగే.. డిమాండ్‌ తగ్గడం వల్ల.. ఇతర దేశాలు కాస్త ధరను తగ్గిస్తాయి. అలా.. బంగారం ధరలు తగ్గుతాయి.

2. మార్కెట్‌లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందరూ బంగారం ధర తగ్గుతుంది.

3. అంతర్జాతీయ లావాదేవీలు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్యయుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం పైకి మళ్లిస్తున్నారు. అందుకే ధర రోజురోజుకి ఇంతలా పెరుగుతోంది.

4. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ ప్రభావం వల్లనే బంగారం ధర తగ్గుముఖం పట్టినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. మార్కెట్‌లో రూపాయి స్థిరంగా కొనసాగుతండటం వల్ల కూడా.. బంగారం ధరలు తగ్గుతాయి.

5. మార్కెట్‌ విశ్లేషకులు సైతం బంగారం ధరల పెరుగుదల అంచనాపై కాస్త తడబాటును వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. బంగారం ధరలు తగ్గడంపై మాత్రం.. పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నా