Maruti Suzuki Cars: రూ. 5లక్షలలోపు బెస్ట్ కార్లు ఇవే.. టాప్ ఫీచర్లు, సూపర్ స్పె సిఫికేషన్లు.. వివరాలు ఇవి..
మన దేశంలో తక్కువ ధరలోనే కార్లు అంటే మొదట గుర్తొచ్చేది మారుతి సుజుకీ. సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ కంపెనీ కార్లు ఉంటాయి. అందుకే 2023లో మన దేశంలో అందుబాటులో ఉన్న తక్కువ బడ్జెట్ కార్లను మీకోసం లిస్ట్ చేశాం. అది కూడా కేవలం రూ. 5లక్షలోపు బడ్జెట్ లోనే. ఆయా కార్లలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు, మార్కెట్ రేటింగ్ వంటి అంశాలను ఓసారి చూద్దాం రండి..
మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల కోసం వెతుకుతున్నారా? తక్కువ ధరలో మంచి లుక్ తో పాటు, అధిక పనితీరు, సాటిలేని ఫీచర్లను అందించే కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇక మీ సెర్చింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే ఈ రోజు మీకు మన దేశంలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను పరిచయం చేస్తున్నాం. మన దేశంలో తక్కువ ధరలోనే కార్లు అంటే మొదట గుర్తొచ్చేది మారుతి సుజుకీ. సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ కంపెనీ కార్లు ఉంటాయి. అందుకే 2023లో మన దేశంలో అందుబాటులో ఉన్న తక్కువ బడ్జెట్ కార్లను మీకోసం లిస్ట్ చేశాం. అది కూడా కేవలం రూ. 5లక్షలోపు బడ్జెట్ లోనే. ఆయా కార్లలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు, మార్కెట్ రేటింగ్ వంటి అంశాలను ఓసారి చూద్దాం రండి..
మారుతీ సుజుకీ ఆల్టో 800..
ఈ కారు మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. కాంపాక్ట్ డిజైన్ కలిగిన ఈ కారు సౌకర్యవంతమైన రైడ్తో పాటు మంచి మైలేజీని అందిస్తుంది. మెయింటెనెన్స్ కాస్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ కారులో 796సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47బీహెచ్పీ, 69ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్జీ వెర్షన్ లోకూడా అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే కారు లోపల కేబిన్ ఎక్కువ స్థలంలో సౌకర్యవంతంగా ఉంటుంది. పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ తో కూడిన ఈబీడీ, వెనుకవైపు పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. 177 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారు ధర రూ. 3.54 లక్షల నుంచి రూ.5.13లక్షల(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.
మారుతీ సుజుకీ ఆల్టో కే10..
అధిక శక్తిని, పనితీరుని అందించే మారుతీ సుజుకీ నుంచి వస్తున్న మరో ఈ ఆల్టో కే10. దీనిలో 998సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67బీహెచ్ పీ, 90ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్జీ వెర్షన్ లో 32.26 కిలోమీటర్/కేజీ మైలేజీ వస్తుంది. దీనిలో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 35 లీటర్లు ఉంటుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే బాడీ కలర్డ్ బంపర్స్, క్రోమ్ గ్రిల్లే, ఓఆర్వీఎంఎస్, డోర్ హ్యాండిల్స్, వీల్ కవర్స్, రూఫ్ యాంటెనా ఉంటుంది. పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉ న్నాయి. 177 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. దీని ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల(ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉంటుంది.
మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో..
మీని ఎస్ యూవీ మోడల్ ఈ కారు బోల్డ్ అండ్ స్పోర్టీ లుక్ లో అదరగొడుతుంది. సీట్ల పొజిషన్, కేబిన్ సౌకర్యవంతంగా ఉంటాయి. దీనిలో 998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 67బీహెచ్పీ, 90ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు ఉంటుంది. ఎల్ఈడీ డీఆర్ ఎల్, ఫ్రంట్ గ్రిల్లే, ఎస్ లోగో, బాడీ కలర్డ్ బంపర్స్ ఉంటాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే దీనిలో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లసర్ట్ ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, టచ్ స్క్రీన్, ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 270 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. రూ. 4.26లక్షల నుంచి రూ. 6.11 లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) వరకూ ఉంటుంది.
మారుతీ సుజుకీ ఇగ్నిస్..
ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ యూనిక్, ఫంకీ డిజైన్ లో వస్తుంది. దీనిలో స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. దీనిలో 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82బీహెచ్ పీ, 113ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయి. 32 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉంటుంది. దీని ఎక్స్ టీరియర్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. డీఆర్ఎల్ తో కూడిన ఎల్ఈడీ ప్రోజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. యూ ఆకారంలోని ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఉంటాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెనుకవైపు పార్కింగ్ కెమెరా, స్టార్ట్ అండ్ స్టాప్ కు పుష్ బటన్ ఉంటుంది. 260 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. రూ. 4.89లక్షల నుంచి రూ. 7.58లక్షల(ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..