
మీ ఇంట్లో టీవీ పాతదైపోయిందా? కొత్త టీవీ కొనాలనే ప్లాన్లో ఉన్నారా? ఏవైనా మంచి ఆఫర్లు వస్తే బాగుండు అని భావిస్తున్నారా? మీరు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పండుగ సంబరాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ కనివినీ ఎరుగని తగ్గింపు ధరలను స్మార్ట్ టీవీలపై అందిస్తోంది. అవి కూడా స్మార్ట్, ఆండ్రాయిడ్, అల్ట్రా హెచ్ డీ, 4కే టీవీలు కావడం విశేషం. అమెజాన్ లో అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ప్రారంభం కానుంది. ఈ సేల్లో అన్ని గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు, వస్తువులపై భారీ తగ్గింపు ధరలు ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. అయితే అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయలేదు గానీ స్మార్ట్ టీవీలపై ఆఫర్లను మాత్రం అమెజాన్ వెబ్ సైట్లో ప్రదర్శిస్తోంది. అక్కడ పెట్టిన ఓ టీజర్లో పలు దిగ్గజ బ్రాండ్ల టీవీలపై అందిస్తున్న రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. వాటిల్లో శామ్సంగ్, వన్ ప్లస్, ఎల్జీ, జియోమీ వంటి బ్రాండ్లకు చెందిన టీవీలు ఉన్నాయి. అవి కూడా 4కే అల్ట్రా హెచ్ డీ, డాల్బీ సౌండ్ సిస్టమ్ తో వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ టీవీలు ఏంటి? ఆఫర్లు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో చాలా టీవీలపై 60శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. పైగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి అదనంగా పాత టీవీ ఎక్స్ చేంజ్ పై కొంత తగ్గింపు లభిస్తుంది. పైగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే తో పాటు కొన్ని బ్యాంకుల కార్డులపై కూడా రాయితీలు వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..