Electric Vehicles: అధిక భద్రత.. మరింత నాణ్యత.. ఎలక్ట్రిక్ వాహనాలకు బీఐఎస్ కొత్త ప్రమాణాలివి..

|

Jun 25, 2024 | 4:14 PM

ముఖ్యంగా బ్యాటరీలు పేలుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో అందరికీ వీటి భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. అంతేకాక ఇప్పటి వరకూ వాటికి క్రాష్ టెస్ట్ లు కూడా ఎప్పుడు నిర్వహించలేదు. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) చర్యలకు ఉపక్రమించింది. ఎలక్ట్రిక్ వాహనాల భద్రత, నాణ్యతను పెంచే లక్ష్యంతో రెండు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది.

Electric Vehicles: అధిక భద్రత.. మరింత నాణ్యత.. ఎలక్ట్రిక్ వాహనాలకు బీఐఎస్ కొత్త ప్రమాణాలివి..
Electric Cars
Follow us on

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. ద్విచక్రవాహనాలతో పాటు, కార్లు కూడా పెద్ద ఎత్తున మన రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల భద్రత విషయంలో చాలా మందికి అనుమానాలున్నాయి. ముఖ్యంగా బ్యాటరీలు పేలుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో అందరికీ వీటి భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. అంతేకాక ఇప్పటి వరకూ వాటికి క్రాష్ టెస్ట్ లు కూడా ఎప్పుడు నిర్వహించలేదు. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) చర్యలకు ఉపక్రమించింది. ఎలక్ట్రిక్ వాహనాల భద్రత, నాణ్యతను పెంచే లక్ష్యంతో రెండు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బీఐఎస్ కొత్త ఈవీ ప్రమాణాలు..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఎలక్ట్రిక్ వాహనాల కోసం రెండు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. అవి ‘IS 18590: 2024’ ‘IS 18606: 2024. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల కీలకమైన భాగాల భద్రత, నాణ్యతతో పాటు పవర్‌ట్రెయిన్‌ పై దృష్టి సారిస్తాయి. ఈ రెండు కొత్త ప్రమాణాలు మూడు విభాగాల్లోని వాహనాలకు వర్తిస్తాయి. అవి ద్విచక్ర వాహనాలు (L), నాలుగు చక్రాల వాహనాలు (M), గూడ్స్ ట్రక్కులు (N). మూడు కేటగిరీల కింద ఉన్న అన్ని ఈవీలు కఠినమైన భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని బీఐఎస్ నిర్ధారిస్తుంది.

బిల్ట్ క్వాలిటీ కూడా..

ఈ కొత్త ప్రమాణాలు బ్యాటరీల భద్రత, పనితీరును నొక్కిచెప్పాయి. అవి శక్తివంతమైనవి, సురక్షితమైనవి అని నిర్ధారిస్తాయి. దేశవ్యాప్తంగా ఈ-కార్ట్‌లు, ఈ-రిక్షాలకు ఆదరణ పెరుగుతుండటంతో ఇవి ఈవీలకు వేగంగా మారతున్నాయి. ఇవి కార్లు, ట్రక్కులకన్నా ఎక్కువగా ఉంటాయని బీఐఎస్ అభిప్రాయపడింది. దీనిని పరిష్కరించడానికి, BIS IS 18294: 2023ని ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా ఈ-రిక్షాలు మరియు ఈ-కార్ట్‌ల భద్రతా ప్రమాణాల కోసం ఏర్పాటు చేస్తుంది.

ఈ ప్రమాణాలు నిర్మాణం నుంచి కార్యాచరణ వరకు వివిధ అంశాలను కవర్ చేస్తాయి డ్రైవర్లు, ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి. తాజా చేర్పులతో, బీఐఎస్ ఇప్పుడు ఛార్జింగ్ సిస్టమ్‌లతో సహా ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి ఉపకరణాలకు సంబంధించి మొత్తం 30 అంశాలలో కొత్త ప్రమాణాలను నిర్ధారించింది. బీఐఎస్ గతంలోనే ప్రమాణిక చార్జింగ్ ప్రొటోకాల్ ని ప్రవేశపెట్టింది.

అంతకుముందు 1 సెప్టెంబర్ 2022న, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలకు ఈవీ బ్యాటరీ పరీక్ష ప్రమాణాల ఏఐఎస్-156, నాలుగు చక్రాల కోసం ఏఐఎస్-038 (రివిజన్ 2)కి సవరణలను జారీ చేసింది. కొత్త ఏఐఎస్-156, ఏఐఎస్-038 ప్రమాణాలను వాహన తయారీకి అవసరమైన సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) కింద మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..