
మీ ఇంట్లో రిటైర్ అయిపోయిన పెద్ద వారు ఉన్నారా? వారి అవసరాల కోసం ఓ కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. సాధారణంగా సీనియర్ సిటిజెనులు కారును సులభంగా డ్రైవ్ చేయగలిగిన, సౌకర్యవంతమైన, అధిక భద్రతతో పాటు మంచి మైలేజీ ఇచ్చే కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. కారులోని ఫీచర్లు, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్, సీట్ అరేంజ్మెంట్స్ వారు ప్రధానంగా దృష్టి పెట్టే అంశాలు. అలాగే ఆయా కార్ల ధరలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. తక్కువ బడ్జెట్లో వచ్చే కార్లను ఇష్టపడతారు. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మోడల్స్ మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్, టాటా టియాగో. ఈ రెండు మోడళ్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ రెండు మోడళ్లు అనువైన బడ్జెట్లో వచ్చేస్తాయి. అలాగే చిన్నగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే వీటిని వృద్ధులు అధికంగా ఇష్టపడతారు.
వీటిల్లో వ్యాగర్ ఆర్ వీఎక్స్ఐ ఏటీ వేరియంట్ కారు సీనియర్ సిటిజెన్స్ కు అత్యుత్తమ ఎంపికగా నిస్తుంది. దీని ధర, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, డ్రైవింగ్ సౌకర్యాన్ని మెరుగు పరుస్తుంది. మైలేజీ కూడా మీకు లీటర్ కు 25.91 కిలోమీటర్లు ఇస్తుంది. 165 మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, ఏబీఎస్ బ్రేకింగ్, బ్లూ టూత్ కనెక్టివిటీ, పవర్ విండోలు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని తర్వాత కొనుగోలు చేయాలనుకుంటే టాటా టియోగో ఎక్స్ టీఏ ఏఎంటీ, వ్యాగర్ ఆర్ జెడ్ఎక్స్ఐ ప్లస్ మంచి ఎంపికలను నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..