
సాధారణంగా అందరికీ వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి. వాటి నుంచి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఆన్ లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు తీసుకుంటున్నారు. వివిధ ప్రభుత్వం పథకాల సొమ్ములు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకే జమవుతున్నాయి. బ్యాంకుల నిబంధనల ప్రకారం ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచాలి. అలాగే ఏటీఎమ్ తదితర వాటికి నిర్వహణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకు ఖాతాలలో శాలరీ ప్యాకేజీ ఖాతాలు వేరుగా ఉంటాయి. ప్రతినెలా జీతం వచ్చే ఉద్యోగులకు వీటిని ప్రారంభిస్తారు. మూమూలు ఖాతాదారులతో పోల్చితే వీరికి కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పిస్తారు. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కూడా ఈ ఖాతాలను అందజేస్తుంది. దానిలో ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం..
ఉద్యోగస్తుల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడం కోసం శాలరీ ప్యాకేజీ ఖాతాలను రూపొందించారు. వీటి ద్వారా ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించడంతో పాటు వివిధ ప్రయోజనాలను అందజేస్తారు. మీరు ఎస్ బీఐలో శాలరీ ఖాతా ప్రారంభించాలనుకుంటే ముందుగా ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా నేరుగా బ్యాంక్‌కు అధికారులను కలవొచ్చు. వీడియో కస్టమర్ గుర్తింపు ప్రక్రియ ద్వారా యోనో అప్లికేషన్‌లో జీతం ప్యాకేజీ ఖాతాను తెరవవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజీ ఖాతాలను అందజేస్తుంది. వాటి వల్ల ఖాతాదారులకు ఈ కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎస్ బీఐలో ఇప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను శాలరీ ఖాతాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకు ఉపాధి రుజువు, జీతం స్లిప్/సర్వీస్ సర్టిఫికెట్ ను బ్యాంకు లో అందజేయాలి. శాలరీ ఖాతాకు వరుసగా మూడు నెలల పాటు జీతం జమ కాకుంటే దానిని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు. వాటికి అనుగుణంగా అన్ని చార్జీలు విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..