Heat Wave: ఎండ ఎక్కువగా ఉందా..? క్షణాల్లోనే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు..

ఎండకు పనులకు వెళ్లలేకపోతున్నారా..? అయితే ఇప్పుడు హీట్ వేవ్ ఇన్యూరెన్స్‌లు అందుబాటులోకి వచ్చేస్తాయి. స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బులు అకౌంట్లో వేస్తారు. ప్రస్తుతం కూలీలు, మహిళలకు వీటిని స్వచ్చంధ సంస్థలు అందిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో వీటిని అందిస్తున్నారు.

Heat Wave: ఎండ ఎక్కువగా ఉందా..? క్షణాల్లోనే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు..
Money

Updated on: May 19, 2026 | 8:06 PM

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారికి మరింత కష్టతరంగా మారింది. ఎండలకు పనులకు వెళితే వడదెబ్బ బారిన పడటంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో కొంతమంది ఎండ దెబ్బకు పనులకు వెళ్లకపోవడంతో జీవనం కష్టతరం అవుతుంది. ఇలాంటి వారి కోసం హీట్ వేవ్ ఇన్యూరెన్స్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏదైనా రోజు పనులకు వెళ్లకపోతే ఆ రోజుకు అకౌంట్లో డబ్బులు వేస్తారు.

నేరుగా అకౌంట్లోకి డబ్బులు

పారామెట్రిక్ ఇన్యూరెన్స్ అని వీటిని పిలుస్తున్నారు. అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, తోపుడు బండ్ల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు స్వచ్చంధ సంస్థలు ఇన్యూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఇన్యూరెన్స్‌లు అందిస్తున్నాయి. వాతావరణశాఖ డేటా ప్రకారం లబ్దిదారుల అకౌంట్లో నేరుగా ఇన్యూరెన్స్ కంపెనీలు డబ్బులు జమ చేస్తోంది. దీంతో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని అనేది ఉండదు. ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం కూడా ఉండదు. స్వచ్చంధ సంస్థలే కూలీల తరపున ప్రీమియం చెల్లిస్తాయి. ఈ ఇన్యూరెన్స్ మార్చి నుంచి జూన్ వరకు వేసవికాలంలో అమల్లో ఉంటుంది. ఎండకు పనికి వెళ్లలేని సమయంలో వాతావరణశాఖ జారీ చేసే రిపోర్టులను పరిగణలోకి తీసుకుని వెంటనే డబ్బులు అకౌంట్లో వేస్తారు.

మహిళల కోసం ప్రత్యేక పాలసీలు

ఇక ఎండల్లో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక ఇన్యూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేక హీట్ వేవ్ ఇన్యూరెన్సులు అందుబాటులో ఉన్నాయి. సెల్ప్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ అనే సంస్థ మహిళల కోసం ప్రత్యేకంగా ఐసీఐసీఐ లంబార్డ్‌తో కలిసి ఇన్యూరెన్స్ అందిస్తోంది. ప్రస్తుతానికి ఆ సంస్థ రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్ర, కోల్ కత్తాలో పైలట్ ప్రాజెక్టుగా బీమా సేవలు అందిస్తోంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సేవలను విస్తరించనుంది. ఇప్పటివరకు 48 వేల మంది స్త్రీలకు ఇన్యూరెన్స్ అందించారు. అయితే ఎంత ఉష్ణోగ్రత దాటితే ఇన్యూరెన్స్ డబ్బులు అందుతాయనే విషయానికి సంబంధించి ప్రాంతాలను బట్టి తేడాలు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఎండ ప్రభావం ఉంటుంది. దీంతో స్థానిక వాతావరణశాఖను సంప్రదించి మనుషులు తట్టుకోలేని టెంపరేచర్ ఉన్నప్పుడు డబ్బులు అందిస్తారు.

Follow Us