Mukesh Ambani: దేశానికి స్వాతంత్యం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో యావత్ భారతావని అజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యుల వరకూ మువ్వన్నెల జెండాను ఎగరవేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలోనూ, కార్యాలయాలు, పని ప్రదేశాలన్నింటినీ త్రివర్ణ పతకాలతో అందంగా అలంకరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట ఇండిపెండెన్స్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబయిలోని ముఖేష్ నివాసమైన ఆంటిలియాలో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో ముఖేష్ మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
ఈ సందర్భంగా ముకేశ్ తన మనవడిని ఎత్తుకోగా.. ఆయన సతీమణి నీతా అంబానీ చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ‘మా తుఝే సలాం’ అంటూ జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ వేడుకల్లో RIL ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. కాగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ముఖేష్ నివాసమంతా మువ్వన్నెల జెండాలతో కళకళలాడింది. కాగా పృథ్వీ అంబానీ డిసెంబర్ 10, 2020న ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు జన్మించాడు. ఇతను ముఖేష్, నీతా అంబానీల మొదటి మనవడు.
#WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL
— ANI (@ANI) August 15, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..