Business Ideas: జస్ట్‌ రూ.1000 పెట్టుబడితో నెలకు రూ.50 వేల సంపాదన! సరికొత్త ట్రెండీ బిజినెస్‌..

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వ్యాపారం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఎలా సంపాదించాలో ఇప్పుడు చూద్దాం.. కేవలం రూ.1000 పెట్టుబడితో రాగి జావ, చిరుధాన్యాల బిస్కెట్లు వంటివి విక్రయిస్తూ రోజుకు రూ.1500-రూ.2000 వరకు సంపాదించవచ్చు. ఆరోగ్య స్పృహ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని, పార్కులు, వాకింగ్ గ్రౌండ్స్ వద్ద స్టాల్ ఏర్పాటు చేసి స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

Business Ideas: జస్ట్‌ రూ.1000 పెట్టుబడితో నెలకు రూ.50 వేల సంపాదన! సరికొత్త ట్రెండీ బిజినెస్‌..
Salary

Updated on: Dec 04, 2025 | 11:15 PM

బిజినెస్‌ చేయాలంటే పెట్టుబడి ఉండాలి, అనుభవం ఉండాలనేది పాత కాలం మాట. ఇప్పుడు ఒక అద్భుతమైన ఐడియా, కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు.. పెట్టుబడి అవసరం లేకుండానే నెలకు వేలకు వేలు సంపాదించుకోవచ్చు. అలాంటి ఓ సూపర్‌ న్యూ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కాలంలో దాదాపు ప్రతీ ఒక్కరు కూడా తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్నింగ్‌ వాక్‌లు, జాగింగ్‌లు, జిమ్‌లో వర్క్‌ అవుట్లు చేస్తూ ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. అలాంటి వారికి మరింత ఆరోగ్య ప్రయోజనం కల్పిస్తూనే మనం ఆదాయం పొందవచ్చు. అది ఎలాగంటే.. మార్నింగ్‌ వాక్‌ చేసే గ్రౌండ్స్, పార్కుల బయట ఉదయం, సాయంత్రం రాగి జావా, జొన్న జావా, చిరు ధాన్యాల బిస్కెట్లు, అలాగే జొన్న రొట్టుల స్టాల్‌ ఏర్పాటు చేస్తే మంచి గిరాకీ ఉంటుంది. హెల్త్‌ కేర్‌ తీసుకునే వాళ్లు ఇలాంటి ఆరోగ్యకరమైన అల్పాహారాలను ఎక్కువగా ఇష్టపడతారు.

పైగా వీళ్లు రెగ్యులర్‌ కస్టమర్లు. రోజువారీగా కాకుండా నెలకు కూడా వారితో మాట్లాడుకొని జావా, రొట్టెలు అమ్మొచ్చు. అయితే ఈ బిజినెస్‌ మరింత ప్రాఫిటబుల్‌గా ఉండాలంటే.. ఇప్పటికే ఉన్న ఒక గొడుగేసుకొని, బండిపైనో, బల్లపైనో కాకుండా ఒక మంచి ఆకర్షణీయమైన సెటప్‌ వేసి బిజినెస్‌ స్టార్‌ చేస్తే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే సెటప్‌ లేకుండా ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలంటే కేవలం రూ.1000 పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. రోజుకు ఒక రూ.1500 నుంచి రూ.2000 ఆదాయం పక్కాగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి