Free Petrol and Diesel: 50 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందండి.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

|

Apr 11, 2021 | 4:03 PM

Free Petrol-Diesel: దేశ వ్యాప్తంగా నిలకడ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి.

Free Petrol and Diesel: 50 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందండి.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..
Petrol And Diesel
Follow us on

Free Petrol-Diesel: దేశ వ్యాప్తంగా నిలకడ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు 90-100 మధ్య కొనసాగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 క్రాస్ చేశాయి కూడా. ఇలాంటి తరుణంలో హెచ్‌డిఎఫ్‌సి బంపర్ ఆఫర్ ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి-ఇండియన్ ఆయిల్ క్రిడిట్ కార్డు‌ వినియోగదారులకు దాదాపు 50 లీటర్ల మేర ఇంధనం ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. హెచ్‌డిఎఫ్‌సి-ఐఒసిఎల్ కార్డు ద్వారా ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ బంక్‌లలో చెల్లింపులు జరిపిన ప్రతిసారి కొన్ని పాయింట్లను ఆఫర్‌గా ఇస్తోంది. తద్వారా ఈ కార్డు కలిగిన వినియోగదారులు ప్రతి ఏటా 50 లీటర్ల వరకు ఉచిత ఇంధనాన్ని సంపాదించవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి-ఐఒసిఎల్ క్రెడిట్ కార్డ్ ముఖ్య ప్రయోజనాలు:
కార్డ్ హోల్డర్లు వారి మొత్తం ఖర్చులో 5 శాతం ఐఓసిఎల్ కార్డుతో సంపాదించవచ్చు. ఇది మొదటి ఆరు నెలలకు నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్స్ వరకు లభిస్తాయి. ఆ తరువాత ఆరు నెలలకు గరిష్టంగా 150 పాయింట్లు లభిస్తాయి. ఇక ఈ కార్డు కలిగిన వినియోగదారులు కిరాణా షాపింగ్, ఇతర బిల్లుల చెల్లింపులపై 5 శాతం ఫ్యూయల్ పాయింట్స్‌ను పొందవచ్చు. ఇలా గరిష్టంగా నెలకు 100 ఫ్యూయల్ పాయింట్స్‌లోపు పొందే అవకాశం ఉంది. అయితే, కనీసం రూ.150ల లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఈ కార్డు దారులకు 1శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు కూడా లభిస్తుంది. ఇలా వచ్చిన ఫ్యూయల్ పాయింట్స్‌తో సదరు కార్డు దారుడు ఏడాదికి 50 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలి?, కార్డ్ రెన్యూవల్ ఛార్జెస్? ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందడానికి రూ.500 నగదుతో పాటు ఇతర ట్యాక్స్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ కార్డ్ కలిగిన వారు సంవత్సరంలో ఈ కార్డును ఉపయోగించి రూ.50 వేలకు పైగా ఖర్చు చేసినట్లయితే.. రెన్యూవల్ ఛార్జీలు మాఫీ చేయడం జరుగుతుంది.

ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఎవరు పొందవచ్చు?
21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ వ్యక్తి అయినా ఈ కార్డ్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ బిజినెస్‌ పర్సన్స్ అయితే 65 ఏళ్ల వయసు వరకు ఈ కార్డ్‌ను పొందే అవకాశం ఉంది. కార్డు కావాలనుకునే వారి నెలవారి కనీస ఆదాయం రూ. 12,000 ఉండాలి. ఇక స్వయ ఉపాధి కలిగిన వారైతే.. ఏడాదికి రూ.2 లక్షలకు పైగా టర్నోవర్ చూపించాల్సి ఉంటుంది.

ఇండియన్ ఆయిల్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఎలా పొందాలి?
హెచ్‌డిఎఫ్‌సి-ఐఒసిఎల్ క్రెడిట్ కార్డు పొందడానికి బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా సమీప బ్యాంకు కార్యాలయానికి వెళ్లి ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దేశంలోని వివిధ నగరాల్లో ఎంపిక చేసిన ఇండియన్ ఫ్యూయల్ బంక్స్‌ నుంచి కూడా ఈ కార్డును పొందవచ్చు.

Also read:

China Vaccine: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు

అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు