HDFC Customers: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఎదురుదెబ్బ.. ఆ రేట్లు పెంపు

|

Feb 09, 2023 | 12:57 PM

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్)ని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నిర్ణయానికి ముందే పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ..

HDFC Customers: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఎదురుదెబ్బ.. ఆ రేట్లు పెంపు
Hdfc
Follow us on

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్)ని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నిర్ణయానికి ముందే పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ పెరిగిన రేట్లు 7 ఫిబ్రవరి 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు బ్యాంకు వినియోగదారులకు రుణ వడ్డీ రేటు కొత్తగా నిర్ణయించబడుతుంది.

Money9 నివేదిక ప్రకారం.. బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు ఓవర్ నైట్  ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.60 శాతానికి చేరుకుంది. ఎంసీఎల్‌ఆర్‌ను ఒక నెలకు 8.60 శాతం, మూడు నెలలకు 8.65 శాతం, ఆరు నెలలకు 8.75 శాతంగా నిర్ణయించింది బ్యాంకు.

ఎంసీఎల్‌ఆర్‌ అంటే ఏమిటి?

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అనేది ఆర్థిక సంస్థలు ఎవరికైనా రుణాలు ఇచ్చే కనీస వడ్డీ రేటును ఎల్‌సీఎల్‌ఆర్‌ అంటారు. ఇంతకంటే తక్కువ వడ్డీకి ఏ బ్యాంకు ఎవరికీ రుణం ఇవ్వదు. ఈ రేటు సెంట్రల్ బ్యాంక్ ద్వారా అమలు చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి సమాచారం అందించారు. 25 వేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. 6.25 నుంచి 6.50 శాతానికి రెపోరేటును పెంచింది. 2023 ఏప్రిల్‌-జూన్‌ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా. ఈ రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి