
పోస్టాఫీస్ గ్రామ సురక్ష పథకానికి తక్కువ సమయంలోనే ఎంతో ఆదరణ లభించింది. దీనిని గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించాలనే సదుద్ధేశంతో తీసుకువచ్చారు. అయితే ఈ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, ప్రీమియం వంటి వివరాలను తెలుసుకుందాం..
ఈ పథకానికి 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులే. ఇందులో పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా 10, 15, 20 సవత్సరాల తర్వాతనే ఫండ్స్ కు మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ మూడింటిలో ఏదైనా కాల వ్యవధిని పెట్టుబడిదారు ఎంచుకోవచ్చు. ఈ స్కీంలో చేరాలనుకునే వారు పోస్టాఫీస్ లో అప్లికేషన్ ఫామ్ ని నింపి అవసరమైన పత్రాలు సమర్పించి చేరవచ్చు.
దరఖాస్తు దారులు తమ శక్తి మేర ఈ పథకంలో డబ్బులు జమచేయవచ్చు. నెల, మూడు నెలలు, ఏడాది.. ఇలా ఎప్పుడూనా ప్రీమియంను జమచేయవచ్చు. అయితే, ఈ పథకంలో కనీసం రోజుకు రూ.50 మాత్రం పెట్టుబడిగా చెల్లించవలసి ఉంటుంది. అంటే నెలకు రూ. 1500. బదులుగా మీరు నిర్ణీత కాలంలో రూ 35 లక్షల రాబడిని పొందొచ్చు.
ఈ పథకంలో చేరిన వారు రోజుకు రూ. 50 డిపాజిట్ చేయగలిగితే దీని ప్రకారం మీ డిపాజిట్ మొత్తం ఒక నెలలో రూ. 1500 అవుతుంది. సంవత్సరంలో రూ. 18 వేలు అవుతుంది. ఒక వ్యక్తి 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసువారైతే మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షల 48 వేలు అవుతుంది. మెచ్యూరిటీ గడువు ముగిసే సమయానికి ఇదే రూ. 30 నుంచి రూ.35 లక్షల వరకు జమ అవుతుంది.
ఈ పథకంలో 19 నుంచి 55 మధ్య వయసున్న భారతీయులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.
రోజూ రూ.50 పెట్టుబడి పెడితే, రూ.35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
ఈ పథకం ద్వారా, రిటైర్మెంట్ తర్వాత వృద్ధులకు బెనిఫిట్ అందుతుంది.
పాలసీ వ్యవధిలోపు పాలసీదారు మరణిస్తే, నామినీలు పాలసీ కింద వచ్చే మొత్తాన్ని పొందవచ్చు.
ఈ పథకంలో చేరి, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్లాన్‌ను ఎండోమెంట్ హామీ ప్లాన్‌గా మార్చవచ్చు.
మీకు దగ్గర్లోని పోస్టాఫీస్‌కి వెళ్లి, ఈ పథకంలో చేరవచ్చు.
19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.
ఈ స్కీమ్‌ను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా దీన్ని నిలిపేయవచ్చు.
ఈ స్కీమ్‌లో బోనస్ కూడా ఉంటుంది. అంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది.