GST Council Meet: జూలై 11న జీఎస్టీ సమావేశం.. వీటిపై ట్యాక్స్‌ విధించే అవకాశం

|

Jun 17, 2023 | 6:06 PM

గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ట్యాక్స్‌ విధించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఇదే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జూలై 11వ తేదీన ఢిల్లీలో జీఎస్టీ..

GST Council Meet: జూలై 11న జీఎస్టీ సమావేశం.. వీటిపై ట్యాక్స్‌ విధించే అవకాశం
Online Gaming
Follow us on

గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ట్యాక్స్‌ విధించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఇదే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జూలై 11వ తేదీన ఢిల్లీలో జీఎస్టీ 50వ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో హార్స్‌ రేస్‌లపై ట్యాక్స్‌కు ఆమోద ముద్ర వేయనుంది. ఇక మరో వైపు నకిలీ రిజిస్ట్రేషన్‌, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌పై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై కీలక నిర్ణయం..

ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఇక కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్‌ డ్యూటీ బోర్డు ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రీసమాచారం అందించారు. ట్యాక్స్‌ ఎగవేతను అరికట్టేందుకు చర్యలు చేపట్టనున్నామని, లా కమిటీ, జీఎస్టీ కౌన్సిల్‌ ద్వారా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ గేమింగ్‌లపై ట్యా్క్స్‌ విధించే అంశాన్ని గత ఏడాది డిసెంబర్‌లో మంత్రుల బృందం తన నివేదికను కౌన్సిల్‌కు సమర్పించినప్పటికీ సమావేశంలో చర్చకు రాలేదు.

అయితే ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, గుర్రపు పందేలపై మంత్రుల బృందం సమర్పించిన నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో గేమింగ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి