GST in July: జూలై  నెలలో లక్షకోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు..కరోనా తరువాత పెరుగుతున్న వాణిజ్యం!

|

Aug 02, 2021 | 3:51 PM

జీఎస్టీ ఆదాయ సేకరణ డేటాను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం, జూలైలో వస్తువులు, సేవా పన్ను (GST) నుండి రూ .1,16,393 కోట్ల వసూళ్లు జరిగాయి.

GST in July: జూలై  నెలలో లక్షకోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు..కరోనా తరువాత పెరుగుతున్న వాణిజ్యం!
Gst Collection In July
Follow us on

GST in July: జీఎస్టీ ఆదాయ సేకరణ డేటాను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం, జూలైలో వస్తువులు, సేవా పన్ను (GST) నుండి రూ .1,16,393 కోట్ల వసూళ్లు జరిగాయి.  జూన్‌లో జీఎస్టీ వసూళ్ల సంఖ్య రూ .92,849 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. జీఎస్టీ వసూళ్లు 33% పెరిగాయి. జూలైలో జీఎస్టీ స్థూల సేకరణ డేటా ఒక సంవత్సరం క్రితం కంటే 33% ఎక్కువ. అంతకుముందు, జూన్‌లో 8 నెలల తర్వాత, దేశంలో  రెండో వేవ్ కరోనా వలన విధించిన లాక్‌డౌన్‌తో  జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల కంటే తక్కువ నమోదు అయింది.

కోవిడ్ -19 కి సంబంధించిన ఆంక్షలను సడలించడం వల్ల, జూలైలో జీఎస్టీ  వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనితో, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం స్పష్టంగా చూడవచ్చు. జీఎస్టీ వసూళ్ల  సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, మొత్తం జీఎస్టీ సేకరణలో కేంద్ర ప్రభుత్వ వాటా అంటే సీజీఎస్టీ రూ. 22,197 కోట్లు, రాష్ట్రాల వాటా అంటే ఎస్జీఎస్టీ రూ .28,541 కోట్లు. ఇంటిగ్రేటెడ్ అంటే ఐజీఎస్టీ రూ .57,864 కోట్లు అదేవిధంగా సెస్ రూ .7,790 కోట్లుగా ఉన్నాయి.

వ్యాపారవేత్తలకు ఉపశమనం

ప్రభుత్వం వ్యాపారవేత్తలకు పెద్ద ఉపశమనం ఇచ్చింది. ఇప్పుడు రూ .5 కోట్లకు పైగా వ్యాపారం ఉన్న జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక రాబడిని స్వీయ ధృవీకరించగలరు. దీని కోసం, చార్టర్డ్ అకౌంటెంట్ నుండి తప్పనిసరి ఆడిట్ సర్టిఫికేషన్ పొందవలసిన అవసరం ఉండదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) దీనిపై ఆదేశాలు జారీ చేసింది.

జూలై 1-జూలై 31 మధ్య జీఎస్టీ వసూలు సమయంలో, అనేక పన్ను సంబంధిత రాయితీలు ఇచ్చారు. ఇందులో ఐటిఆర్ దాఖలు గడువు 15 రోజుల పొడిగింపు కూడా ఉంది. ఇది కాకుండా, వడ్డీ రేట్లు కూడా తగ్గించారు. ప్రభుత్వం సీజీఎస్టీ రూ .28,087 కోట్లు ఎస్జీఎస్టీ రూ .24,100 కోట్లు, ఐజీఎస్టీ నుండి జులైలో రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా సెటిల్ చేసింది.

Also Read: Digital Currency: డిజిటల్ కరెన్సీ వైపు రిజర్వ్ బ్యాంక్ చూపు..డిజిటల్ కరెన్సీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

Bank Customers: ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. అక్టోబర్‌ 1 నుంచి అవి చెల్లుబాటు కావు.. విత్‌డ్రా చేసుకోలేరు!