Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..

|

Aug 17, 2021 | 4:21 PM

చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలంటే పోస్టాఫీసులో చాలా స్కీమ్స్ అనువుగా ఉంటాయి. పోస్టాఫీసు‌లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గ్రామ్ సంతోష్...

Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..
Post Office Gram Santosh Sc
Follow us on

చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలంటే పోస్టాఫీసులో చాలా స్కీమ్స్ అనువుగా ఉంటాయి. పోస్టాఫీసు‌లో పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటుంది. తక్కువ ప్రీమియంతో ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. దేశంలో అధిక జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. చాలా మంది ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులు తమ భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళికను రూపొందించలేకపోతున్నారు. వారు రక్షణ బీమా కోసం ప్రీమియం చెల్లించలేరు. అదేవిధంగా ఇండియా పోస్ట్ ఆఫీస్ గ్రామీణ ప్రజల కోసం బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల బలహీన వర్గాల కుటుంబాలకు.. అలాగే ఈ పథకం కింద పనిచేసే మహిళలకు అవగాహన కల్పించడం..  బీమా ఎందుకు ఇంత ముఖ్యమైనదో అర్థం అయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. గ్రామీణ పోస్టల్‌లో జీవిత బీమా అనేది ‘గ్రామ సంతోష్’ అనే పాలసీ. ఈ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని గురించి అన్నీ తెలుసుకుందాం. 

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది భారత ప్రభుత్వం జీవిత బీమా పథకం. గ్రామ్ సంతోష్ అనేది ఇండియా పోస్ట్  ఎండోమెంట్ ప్లాన్. ఈ పథకం ప్రధాన లక్షణం ఏమిటంటే ఇది 10 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందిస్తుంది.

గ్రామీణ తపాలా జీవిత బీమా – గ్రామ్ సంతోష్ ఒక ఎండోమెంట్ బీమా పథకం. మరింత సమాచారం కోసం  సందర్శించండి: https://t.co/mqteO1jHq9

గ్రామీణ పోస్టల్ జీవిత బీమా – గ్రామ్ సంతోష్ ఒక ఎండోమెంట్ బీమా పథకం.  తెలుసుకోవడానికి  సందర్శించండి: https://t.co/mqteO1jHq9 #InsuranceHoTohPostalHo pic.twitter.com/RQ8hiUiM1B

– ఇండియా పోస్ట్ (@IndiaPostOffice) ఆగస్టు 17, 2021

ఏ వయస్సువారు ప్రయోజనాలను పొందవచ్చు..

19 ఏళ్ల వయసు కలిగిన వారు గ్రామ సంతోష్ పాలసీలో చేరొచ్చు. 55 ఏళ్లలోపు వారు ఈ పాలసీ పొందొచ్చు. కనీసం రూ.10 వేల బీమా మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ టర్మ్ 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లుగా ఉంటుంది. పాలసీ మూడేళ్లు పూర్తయిన తర్వాత మీరు దానికి వ్యతిరేకంగా రుణం కూడా తీసుకోవచ్చు. ఈ పథకం కింద ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ పథకం కింద ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ వరకు ప్రతిపాదకుడు డిపాజిట్ బోనస్, భీమా మొత్తాన్ని చెల్లిస్తారని హామీ ఇచ్చారు.  

పథకంలో చేరడానికి ఎంత మొత్తం

బీమాదారు మరణించినట్లయితే బీమా మొత్తంతో పాటు.. బోనస్‌ని నామినీకి పూర్తి మొత్తాన్ని అందిస్తారు. ఈ పథకంలో ప్రారంభ పెట్టుబడి మొత్తం రూ. 10,000 , గరిష్టంగా 10 లక్షల వరకు తీసుకోవచ్చు.

కాబట్టి బోనస్ పొందండి

కానీ మీరు ఐదేళ్ల ముందు పథకాన్ని సరెండర్ చేస్తే మీకు బోనస్ మొత్తం అందుతుంది. ఉదాహరణకు మీకు 25 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. రూ.3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు మెచ్యూరిటీ కాలంలో ఎంత డబ్బులు పొందొచ్చొ తెలుసుకుందాం. 35 ఏళ్లు- రూ.4.44 లక్షలు, 40 ఏళ్లు – రూ.5.16 లక్షలు, 45 ఏళ్లు -రూ.5.88 లక్షలు, 50 ఏళ్లు – రూ.6.6 లక్షలు, 55 ఏళ్లు – రూ.7.3 లక్షలు, 58 ఏళ్లు – రూ.7.75 లక్షలు, 60 ఏళ్లు – రూ.8.04 లక్షలు లభిస్తాయి.

పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా PLI – RPLI అనే రెండు వర్గాలుగా విభజించబడింది. PLI అనేది పురాతన ప్రభుత్వ బీమా పాలసీ. ఒకవేళ కస్టమర్ ఐదేళ్లు పూర్తి కాకముందే పాలసీపై రుణం తీసుకుంటే.. అప్పుడు కూడా ఆ బోనస్ ప్రయోజనం అందుబాటులో ఉండదు. పాలసీలో నామినీని మార్చే సౌకర్యం కూడా ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.

 ఎస్‌ఐ దెబ్బ..రేపిస్ట్ అబ్భా..భారీ స్కెచ్‌తో ట్రాప్ చేసి రేపిస్ట్ బెండు తీసిన లేడీ పోలీస్ ..:Lady SI In Delhi Video.

 సూపర్ మార్కెట్లో ఒక్కమగాడిలా మార్టీ..! 50 మంది చేసే పని ఒక్కరే చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది..:Marty Robot Video

 News Watch : మధ్యవర్తిత్వానికి జగన్ ఎందుకు నో చెప్పారంటే ! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )