ఆపరేటర్లకు గుడ్ న్యూస్.. 5జీ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

5జీ టెక్నాలజీ సేవలు భారత్‌లో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఈ 5జీ టెక్నాలజీతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో డేటా వేగం మరింత పెరిగనుంది. అంతేకాదు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ సహా సాకేంతికత ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అయితే ఈ 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొలుత హువావేకు అనుమతివ్వాలనుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఆపరేటర్లందరికీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ […]

ఆపరేటర్లకు గుడ్ న్యూస్.. 5జీ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 5:03 AM

5జీ టెక్నాలజీ సేవలు భారత్‌లో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఈ 5జీ టెక్నాలజీతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో డేటా వేగం మరింత పెరిగనుంది. అంతేకాదు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ సహా సాకేంతికత ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అయితే ఈ 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొలుత హువావేకు అనుమతివ్వాలనుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఆపరేటర్లందరికీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇది కేవలం స్పెక్ట్రం ట్రయల్ టెస్ట్‌లకు ఇస్తున్న అనుమతి మాత్రమేనన్నారు. దీనికి సంబంధించిన పర్మిషన్ల ప్రక్రియను టెలికాం విభాగం (డీవోటీ) నిర్వహించనుంది. డీవోటీ అనుమతి తర్వాత.. ఆపరేటర్లు వారి ఇష్టప్రకారం స్పెక్ట్రం సర్వీసులను అందించే నోకియా, హువావే, ఎరిక్సన్‌లలో ఎవరితోనైనా భాగస్వామ్యంగా ఏర్పడవచ్చని తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు డీవోటీ అందరి ఆపరేటర్లతో మంగళవారం సమావేశం ఏర్పాటుచేయనుంది.

కాగా, ఇంటర్నేషనల్‌గా నెట్‌వర్క్ సెక్యూరిటీ పరంగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న హువావే సంస్థకు కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో కాస్త ఉపశమనం లభించనుంది. గతంలో ఈ సంస్థపై నిషేధం విధించాలనుకున్నప్పటికీ.. అలా చేస్తే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ మరో రెండు, మూడు ఏళ్లు ఆలస్యమవుతుందన్న రీజన్‌తో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద మొబైల్ సర్వీస్ మార్కెట్‌గా ఉంది. దీంతో ఈ 5జీ స్పెక్ట్రం అనుమతుల ప్రక్రియ ఆపరేటర్లకు ఎంతో కీలకం కానుంది.