వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. వాటిలో వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్‌ చేయండి.. లేదంటే అంతే!

కేంద్ర మంత్రిత్వ శాఖ వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్‌లకు కీలక సూచనలు జారీ చేసింది. వాహన్, సారథి పోర్టల్‌లలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం లేకుండా OTP దృవీకరణ పొందాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొంది. పాత నంబర్ల సమస్యలు నివారించి, వ్యక్తిగత లావాదేవీలు సులభతరం చేయడానికి, జాతీయ డేటాబేస్ భద్రతకు ఈ అప్‌డేట్ కీలకమైనదని తెలిపింది.

వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. వాటిలో వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్‌ చేయండి.. లేదంటే అంతే!
Update Mobile Number For Dlrc

Updated on: Dec 31, 2025 | 3:17 PM

వాహన రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు, ఇతర పర్మిట్‌లు వంటి ఆన్‌లైన్ సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అందరూ వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు అధికారిక వాహన్ (Vahan) లేదా సారథి (Sarathi) పోర్టల్‌లలో తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రవాణా రంగం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మారుతున్న నేపథ్యంలో తాజాగా మొబైల్‌ నెంబర్స్‌ ఉండడం చాలా ముఖ్యమని తెలిపింది.

ఒక వేళ మీరు మీ మొబైల్‌ నెంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోకపోతే OTP దృవీకరణను పొందలేరని పేర్కొంది. ఇది లక్షలాది మంది పౌరులకు ఇబ్బంది కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా మంది యూజర్లు సంవత్సరాల గతంలో రిజిస్టర్ చేసిన పాత నంబర్లతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అవి ఇకపై యాక్టివ్‌గా లేదా ఉపయోగంలో ఉండకపోవచ్చునని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఈ నంబర్‌ను అప్‌డేట్ చేయడం వల్ల వ్యక్తిగత లావాదేవీలు సులభతరం కావడమే కాకుండా, జాతీయ రవాణా డేటాబేస్ భద్రత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎలా చేయాలి?

ఇవి కూడా చదవండి
  • మీ మొబైల్ లేదా పీసీలో https://vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • “Update Mobile Number” ఆప్షన్ ఎంచుకోండి.
  • వాహన రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్ చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి.
  • కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  • కొత్త నంబర్‌కు వచ్చిన OTPతో ధృవీకరించండి.
  • సబ్‌మిట్ చేసి, అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోండి.

డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారి కోసం సారథి పోర్టల్‌లో మీ మొబైల్‌ నెంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోండి.

  • మొదగటా మీరు sarathi.parivahan.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • “Update Mobile Number” లేదా సంబంధిత సర్వీస్ ఆప్షన్ ఎంచుకోండి.
  • డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయండి.
  • కొత్త మొబైల్ నంబర్ నమోదు చేసి, OTPతో ధృవీకరించండి.

ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది, RTOకు వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే అప్‌డేట్ చేసుకోవడం మంచిది, లేకపోతే ఆన్‌లైన్ సేవల్లో అంతరాయాలు ఎదుర్కొనవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.