
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల నుంచి 25 లక్షల టన్నుల గోధుమలను కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌కు సరఫరా చేయనుంది. ఈ గోధుమ గిడ్డంగి నుండి జనవరి, మార్చి 2024 మధ్య సరఫరా అవుతుంది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ఈ తరలింపు జరుగుతుందనిఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. దేశీయ మార్కెట్‌లో గోధుమల సరఫరాను కొనసాగించేందుకు, ధరలను నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ. ఇది వివిధ రకాల ఆహార ధాన్యాలను నిల్వ చేస్తూ సరఫరా చేస్తుంది. ఈ ఏడాది మేలో దశలవారీగా గోధుమలను విక్రయించాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలోఫుడ్ సెక్రటరీ మాట్లాడుతూ, ఎఫ్‌సిఐ నుండి వారంవారీ ఈ-వేలం ద్వారా ఇప్పటివరకు 44 లక్షల 60 వేల టన్నులు విక్రయించినట్లు తెలిపారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద జనవరి -మార్చి 2024 మధ్య అదనంగా 25 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. దేశీయ మార్కెట్‌లో గోధుమ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను కొనసాగించడానికి, ధరను నియంత్రించడానికి ఈ చర్య తీసుకోనున్నారు అధికారులు. ఈ సరఫరా ఒకేసారి జరగదని ఆహార కార్యదర్శి వెల్లడించారు. ఈ-వేలం ద్వారా ప్రతి వారం ఈ గోధుమలను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇది కాకుండా, NAFED, NCCF, సెంట్రల్ వేర్‌హౌస్‌ల వంటి సహకార సంఘాలకు ఎఫ్‌సిఐ గోధుమలను సరఫరా చేస్తుందని ఆహార కార్యదర్శి తెలిపారు. ఇది ‘భారత్ అటా’ బ్రాండ్ పేరుతో పిండి విక్రయానికి సరఫరా చేయనుంది కేంద్రం. ఈ సబ్సిడీ పిండి ధర రిటైల్ మార్కెట్‌లో విక్రయించే పిండి కంటే తక్కువ ధరకు లభిస్తుందని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి