Covid-19 Health Insurers: కరోనా మహమ్మారి వేళ.. ఆరోగ్య బీమా సంస్థలు కీలక నిర్ణయాలు.. ప్రీమియంలో డిస్కౌంట్‌

Covid-19 Health insurers: కరోనాకు ముందు ఆరోగ్య బీమా చేసుకునే వారు పెద్దగా లేకపోయినా.. కరోనా తర్వాత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆరోగ్య బీమాలు తీసుకుంటున్నారు...

Covid-19 Health Insurers: కరోనా మహమ్మారి వేళ.. ఆరోగ్య బీమా సంస్థలు కీలక నిర్ణయాలు.. ప్రీమియంలో డిస్కౌంట్‌
Covid 19 Health Insurers

Updated on: Mar 24, 2021 | 8:38 AM

Covid-19 Health Insurers: కరోనాకు ముందు ఆరోగ్య బీమా చేసుకునే వారు పెద్దగా లేకపోయినా.. కరోనా తర్వాత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆరోగ్య బీమాలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ 19 తర్వాత ఆరోగ్య బీమాకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. కోవిడ్‌ చికిత్సకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.10 నుంచి రూ.20 వరకూ వ్యయాన్ని భరించాల్సి రావడంతో ఆరోగ్య బీమా వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. దీంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండటం తప్పనిసరిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఏ, బీమా సంస్థలు మార్పులు తీసుకువచ్చాయి. బీమా కంపెనీలు అందించే పాలసీ నియమ నిబంధనల్లో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్య బీమా పాలసీల్లో కొనుగోలును మరింత సులభతరం చేస్తున్నాయి.

చాలా వరకు డిజిటల్‌ అండర్ రైటింగ్‌ ప్రాసెస్‌లోనే పాలసీలను అందిస్తున్నాయిన బీమా సంస్థలు. అయితే కోవిడ్‌ -19 సమయంలో పలు ఆరోగ్య బీమా సంస్థలు ప్రీమియంలో డిస్కౌంట్‌ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. అలాగే టీకాలు వేసే సమయంలో తలెత్తే అనారోగ్య సమస్యలపై కూడా బీమా సంస్థలు సహాయ పడుతున్నాయి. కోవిడ్‌ బారిన పడిన వారిలో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రీమియంలలో డిస్కౌంట్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

దీనివల్ల క్లిష్టపరిస్థితుల్లో తప్ప బీమా కావాల్సిన వారు శరీర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం తగ్గిపోయింది. అలాగే డిసీజ్‌ మేనేజ్‌మెంట్‌ బెనిఫిట్‌ వంటివి కూడా అందించే పాలసీలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అంతేకాదు అప్పటికే ఉన్న అనారోగ్యాలకు సంబంధించి కేవలం 2 నుంచి 4ఏళ్లలోపు మాత్రమే వెయిటింగ్‌ పీరియడ్‌ను పరిమితం చేస్తున్నారు. పాలసీ తీసుకున్న కొన్ని నెలల్లోనే క్లెయిమ్‌ చేసుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అయితే కొన్ని పాలసీల్లో పాత అనారోగ్యాలున్నా పాలసీ తీసుకున్న రోజు నుంచే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. గతంలోకింటే భిన్నంగా ఇప్పుడు 20 ఏళ్ల నుంచి హైపర్‌ టెన్షన్ తో బాధపడుతున్న రోగికి కూడా పాలసీలను అందిస్తున్నారు.

అలాగే కేన్సర్‌, కిడ్నీ, శ్వాసకోశ తదితర వ్యాధలున్న వారు కూడా ఆరోగ్య బీమా పొందే అవకాశం ఉంటుంది. అయితే పాలసీలు తీసుకునే ముందు అనారోగ్యాలను దరఖాస్తు ఫామ్‌లో తప్పనిసరిగా పేర్కొనాలి.  అయితే దీర్ఘకాలిక అనారోగ్యాలకు, ప్రాణాంతక వ్యాధులకు అతి తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న పాలసీలనే ఎంచుకోవాలి. జీరో కో పేమెంట్‌, విభిన్న రకాల ఆరోగ్య పరిస్థితులకు పలు రకాల చికిత్సకు సబ్‌ లిమిట్స్‌, రూమ్‌ రెంట్‌ వంటివి అందించే ప్లాన్స్‌ను పరిశీలించాలి. ఆరోగ్య బీమాపై ఆపక్తి పెరిగింది. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరిగింది. అదే సమయంలో బీమా సంస్థలు కూడా చాలా వరకు తమ నిబంధనలను సడలించి, బీమా కొనుగోలును సులభం చేశాయి. అలాగే అవసరమైన పాలసీలను తీసుకుంటే మన ఆదాయంలో నుంచి ఆరోగ్య చికిత్సల వ్యయం పూర్తిగా తగ్గించుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి : Sukanya Samriddhi PPF: సుకన్య సమృద్ధి యోజన పథకం.. పీపీఎఫ్‌లలో ఏది బేటర్‌.. రెండింటిలో తేడాలు ఏమిటీ..?

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో.

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?

Follow Us