గుడ్‌న్యూస్: తగ్గుతోన్న బంగారం.. పెట్రోల్ ధరలు..!

| Edited By:

Oct 15, 2019 | 4:47 PM

బంగారు ప్రియులకు.. అటు వాహనదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజులుగా.. బంగారం, వెండి ధరలు.. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితం.. బంగారం 40వేల బెంజ్ మార్క్‌ను దాటింది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినీ.. బంగారం పైపైకి ఎగబాకి.. చమురు ధరలు మాత్రం తగ్గాయి. దేశీ మార్కెట్లో బంగారం ధర గత మూడు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ రోజు మార్కెట్లో.. 24 క్యారెట్స్ […]

గుడ్‌న్యూస్: తగ్గుతోన్న బంగారం.. పెట్రోల్ ధరలు..!
Follow us on

బంగారు ప్రియులకు.. అటు వాహనదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజులుగా.. బంగారం, వెండి ధరలు.. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితం.. బంగారం 40వేల బెంజ్ మార్క్‌ను దాటింది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినీ.. బంగారం పైపైకి ఎగబాకి.. చమురు ధరలు మాత్రం తగ్గాయి.

దేశీ మార్కెట్లో బంగారం ధర గత మూడు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ రోజు మార్కెట్లో.. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.39,700లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ఆభరణాలు ధర రూ.36,410లుగా ఉంది. కాగా.. ఇందుకు విరుద్ధంగా.. వెండి మాత్రం పరుగులు పెడుతోంది. ఈరోజు 100 పెరిగి.. కిలో రూ.48,650కు చేరింది.

కాగా.. అటు అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతోన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌‌ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.77.67గా ఉంది. డీజిల్ లీటర్ ధర 72 రూపాయలుగా ఉంది. అలాగే.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.73.27 కాగా.. డీజిల్ రూ. 66.41గా ఉంది. ఇక దేశ ఆర్థికనగరం అంటే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.88 కాగా.. డీజిల్ రూ.69.61గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.09 కాగా.. డీజిల్ రూ.70.14గా ఉంది. మొత్తంగా చూస్తే ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.