Tomato Price: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న టామోటా ధరలు

|

Jul 14, 2024 | 7:26 AM

ఉత్తర భారత ప్రజలకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాల నుండి శుభవార్త అందింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టమాట ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో టమాటా ధర కిలో రూ.75కి చేరింది. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరఫరాలో అంతరాయం కారణంగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు..

Tomato Price: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న టామోటా ధరలు
Tomato Price
Follow us on

ఉత్తర భారత ప్రజలకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాల నుండి శుభవార్త అందింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టమాట ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో టమాటా ధర కిలో రూ.75కి చేరింది. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరఫరాలో అంతరాయం కారణంగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు త్వరలో స్థిరపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

టమోటాలు ఎందుకు ఖరీదైనవి?

ఢిల్లీతోపాటు మరికొన్ని నగరాల్లో టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాల తర్వాత మండుతున్న వేడి కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడి, చిల్లర ధరల పెరుగుదలకు దారితీసింది. న్యూఢిల్లీలో టమాటా ధర కిలో రూ.75కి చేరిందని, అయితే భారీ వర్షాల కారణంగా సరఫరాకు అంతరాయం కలగకపోతే తగ్గే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి?

మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, జూలై 13న ఢిల్లీలో టమాటా రిటైల్ ధర కిలో రూ.77 ఉండగా, ఏడాది క్రితం ఇదే కాలంలో కిలో ధర రూ.150గా ఉంది. జులై 13న మొత్తం భారతదేశ సగటు రిటైల్ టమాటా ధర కిలో రూ.67.65గా ఉండగా, గతేడాది కిలో రూ.53.36గా ఉంది. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.70గా ఉంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి టమోటాలు సరఫరా అవుతున్నాయి.

రెండు వారాల్లో టమాట ధరలు తగ్గే అవకాశం

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి హైబ్రిడ్ టమోటాలు చేరుకోవడంతో ధరలు తగ్గుముఖం పడతాయని అధికారి తెలిపారు. సబ్సిడీ టమోటాల విక్రయాలను పునఃప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం లేదు. గతేడాది కిలో ధర రూ.110 దాటడంతో ఈ చర్యను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచి సరఫరా మెరుగుపడటంతో ఒకటి, రెండు వారాల్లో ధరలు సాధారణ స్థితికి వస్తాయని అధికారి తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి