
Gold Price Today: గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిగి వస్తోంది. లక్షా 33 వేల వరకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడు లక్షా 20 వేల దిగువన చేరుకుంటోంది. సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రోజుల్లో ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. అయినా ఇప్పటికే ధరలు భారీగానే ఉన్నాయి. ఇది సామాన్యుడికి కొంత భారమే. నిన్న తులం బంగారం ధర రూ. 1లక్ష 22 వేలకుపైగా ఉండగా, ప్రస్తుతం అంటే అక్టోబర్ 29వ తేదీన చూస్తే భారీగా తగ్గుముఖం పట్టింది రోజుల్లో సుమారుగా రూ.1500 వరకు తగ్గింది. ప్రస్తుతం ధరలు దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,810 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,740 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజుల్లో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గినా తర్వాత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి