NO TCS On Overseas Spending: విదేశాల్లో షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్.. టీసీఎస్ మినహాయిస్తూ సంచలన నిర్ణయం

|

May 20, 2023 | 9:00 PM

ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కిందకు తీసుకువచ్చింది. విదేశాల్లో క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే ఏ ఖర్చుకైనా జూలై 1 నుంచి 20 శాతం పన్ను విధిస్తారు. డెబిట్ కార్డ్ ఖర్చు ఇప్పటికే ఎల్ఆర్ఎస్‌లో భాగంగా ఉంది. అయినప్పటికీ, మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్) విధించడంతో చాలా మంది ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది.

NO TCS On Overseas Spending: విదేశాల్లో షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్.. టీసీఎస్ మినహాయిస్తూ సంచలన నిర్ణయం
Indians Going Abroad
Follow us on

వ్యక్తిగత పనులపై లేదా విహారయాత్రలకు చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ కచ్చితంగా చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఆ క్రెడిట్ కార్డు ఖర్చులపై టీసీఎస్‌ను విధిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కిందకు తీసుకువచ్చింది. విదేశాల్లో క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే ఏ ఖర్చుకైనా జూలై 1 నుంచి 20 శాతం పన్ను విధిస్తారు. డెబిట్ కార్డ్ ఖర్చు ఇప్పటికే ఎల్ఆర్ఎస్‌లో భాగంగా ఉంది. అయినప్పటికీ, మూలం వద్ద వసూలు చేసిన పన్ను (టీసీఎస్) విధించడంతో చాలా మంది ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. విదేశాల్లో ఏదైనా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 7 లక్షల వరకు ఖర్చు చేస్తే టీసీఎస్ మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. ఒక వ్యక్తి తన అంతర్జాతీయ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఆర్థిక సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు చేసే ఏవైనా చెల్లింపులు ఎల్‌ఆర్‌ఎస్ పరిమితుల నుంచి మినహాయింపు వస్తుందని, అలాగే ఆ ఖర్చుపై టీసీఎస్ విధించమని సంబంధిత అధికారులు తెలిపారు. 

అలాగే తాజా నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే ఈ ఖర్చులు రూ.7 లక్షల దాటితే 20 శాతం టీసీఎస్ లేవీ వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం సంవత్సరానికి రూ.7 లక్షల వరకూ విదేశీ వైద్య చికిత్స, విద్య ఖర్చులు TCS నుంచి మినహాయించారు. రూ.7 లక్షలకు మించిన ఖర్చులపై 5 శాతం లెవీ వసూలు చేస్తారు. విద్యా రుణాలు పొందిన వారికి టీసీఎస్ రేటు 0.5 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం ఆవిష్కరించదగినతే అయినా రూ.7 లక్షల పరిమితి అనేది చాలా తక్కువని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నిర్ణయం విదేశీ పర్యాటకంపై భారీ ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. టీసీఎస్‌కు సంబంధించి 20 శాతం రేటు చాలా ఎక్కువగా ఉన్నందున, విదేశీ పర్యటనల సమయంలో చేసే ఏదైనా ఖర్చుపై ముందస్తు పన్నును కోరుతున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం మాత్రమేనని వారు పెదవి విరుస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వార్షిక ఐటీ రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో తెలిసిన ఆదాయ వనరులన్నింటిని పన్ను విధించినట్లు చూపడం ద్వారా ఈ టీసీఎస్ రీఫండ్‌ను క్లెయిమ్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఇవి కూడా చదవండి