
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పథకం చిన్న నెలవారీ విరాళాల ద్వారా సంపదను పెంచుకోవడానికి ఒక గొప్ప మార్గం. కేవలం రూ. 100 కనీస డిపాజిట్‌తో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకంలో 6.7 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే పెట్టుబడిపై హామీతో పాటు సురక్షితమైన రాబడిని వస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం స్థిర రాబడితో కూడిన నమ్మకమైన పెట్టుబడి ఎంపిక. ఇది ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ ప్లాన్ చిన్న నెలవారీ డిపాజిట్లు చేయడం ద్వారా గణనీయమైన పొదుపులను కూడబెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్‌లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం అనేది కాలక్రమేణా తమ పొదుపును పెంచుకోవాలనుకునే వ్యక్తులకు సురక్షితమైన, క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. స్థిరమైన డిపాజిట్ ప్లాన్‌తో మీరు స్థిర వడ్డీ రేటు నుంచి ప్రయోజనం పొందుతూ గణనీయమైన రాబడిని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..