Yamaha RX 100: ఆర్‌ఎక్స్‌ 100 లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టన్నింగ్‌ ఫీచర్లతో మార్కెట్‌లోకి రీరిలీజ్‌

| Edited By: Ram Naramaneni

Oct 19, 2023 | 6:47 PM

అప్పుడెప్పుడో మార్కెట్‌ను ఏలిన యమహా ఆర్‌ఎక్స్‌ 100 గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా యువతను ఆ బైక్‌ సౌండ్‌ విపరీతంగా ఆకట్టుకుంది. యమహా ఆర్‌ఎక్స్‌ 100 మోటార్‌సైకిల్ బైక్ ప్రియుల్లో ఒక లెజెండ్‌గా ఉంటుంది. అయితే ఈ తాజా బైక్‌ మార్కెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ వార్త సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తోంది.

Yamaha RX 100: ఆర్‌ఎక్స్‌ 100 లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టన్నింగ్‌ ఫీచర్లతో మార్కెట్‌లోకి రీరిలీజ్‌
Yamaha Rx 100
Follow us on

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ ఈ పదం మనం చాలా సార్లు వింటూ ఉంటాం. పాత వస్తువులకు ఉండే విలువ వేరు. అయితే మెకానిజంతో పని చేసే వస్తువులకు మాత్రం కొత్తక వింత పాత ఒక రోత అనే నానుడి ఉంది. కానీ బైక్స్‌ విషయానికి వస్తే ఎన్ని కొత్త మోడల్స్‌ బైక్‌లు వచ్చినా పాత మోడల్స్‌కు ఉండే డిమాండ్‌ వేరు. అప్పుడెప్పుడో మార్కెట్‌ను ఏలిన యమహా ఆర్‌ఎక్స్‌ 100 గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా యువతను ఆ బైక్‌ సౌండ్‌ విపరీతంగా ఆకట్టుకుంది. యమహా ఆర్‌ఎక్స్‌ 100 మోటార్‌సైకిల్ బైక్ ప్రియుల్లో ఒక లెజెండ్‌గా ఉంటుంది. అయితే ఈ తాజా బైక్‌ మార్కెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ వార్త సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తోంది. యమహా ఈ క్లాసిక్‌ని సరికొత్త రూపంతో, అదనపు శక్తితో పునరుద్ధరిస్తోంది. కాబట్టి ఈ బైక్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

తాజా అప్‌డేటెడ్‌ యమహా ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ 200 సీసీ లేదా అంతకంటే ఎక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా యమహా ఆర్‌ఎక్స్‌ 100 అంటే 100 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. కానీ అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో దీన్ని 200 సీసీకు మార్చారు. అయితే మార్కెట్‌లో రీలాంచ్‌కు సంబంధించి వార్తను యమహా కంపెనీ అధికారికంగా ధ్రువీకరించినప్పటికీ దాని లాంచ్, ఫీచర్ల గురించి నిర్దిష్ట వివరాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ బైక్ 2026 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. యమహా ఆర్‌ఎక్స్‌ 100 మొదటిసారిగా 1985లో ప్రారంభించారు. 1996లో ఈ బైక్‌ ఉత్పత్తిని నిలిపివేయబడే వరకు విపరీతమైన ప్రజాదరణను పొందింది. ఆర్‌ఎక్స్‌ 100కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ 4-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది రహదారిపై బలమైన శక్తిని, టార్క్‌ను అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారుగా రూ. 1 లక్ష ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాబోయే యమహా ఆర్‌ఎక్స్‌ 100 డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, రెట్రో-స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది మృదువైన నగర రోడ్లు, కఠినమైన రోడ్లల్లో మెరుగైన పనితీరు కోసం మెరుగైన సస్పెన్షన్‌తో కూడా వస్తుంది. ఎల్‌ఈడీ లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్‌ఎల్‌), స్వీయ-ప్రారంభ ఎంపిక ప్యాకేజీలో భాగం. అసలు యమహా ఆర్‌ఎక్స్‌ 100 11 పీఎస్‌ పవర్, 10.39 ఎన్‌ఎం టార్క్, రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లతో జత చేశారు. ఈ బైక్‌ 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా కిక్-స్టార్ట్ మెకానిజంపై ఆధారపడి పని చేస్తుంది. ఇంధన ట్యాంక్‌పై ఉక్కుతో రూపొందించిన యమహా బ్యాడ్జ్ దాని ప్రత్యేకంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం