PF Bonus: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.50 వేల బోనస్ పొందే అవకాశం

|

Jun 18, 2024 | 3:45 PM

చాలా మంది ఈపీఎఫ్ఓ ​​సభ్యులకు దానిలోని కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలియదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ ప్రొవిజన్‌ను చాలా మంది ఖాతాదారులు పట్టించుకోరు. అయితే తాజాగా ఈ నిబంధన కింద ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.50,000 వరకు భారీ ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

PF Bonus: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.50 వేల బోనస్ పొందే అవకాశం
Epfo
Follow us on

ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంతో ఈపీఎఫ్ఓ ​​ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈపీఎప్ పదవీ విరమణ కోసం పొదుపు ప్రణాళికను అందిస్తుంది. ముఖ్యంగా రిటైర్‌మెంట్ తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. చాలా మంది ఈపీఎఫ్ఓ ​​సభ్యులకు దానిలోని కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలియదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ ప్రొవిజన్‌ను చాలా మంది ఖాతాదారులు పట్టించుకోరు. అయితే తాజాగా ఈ నిబంధన కింద ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.50,000 వరకు భారీ ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఈ ప్రయోజనానికి అర్హత పొందడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈపీఎఫ్ చందాదారులకు రివార్డ్ చేయడానికి లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్‌ను అందజేయాలని సిఫార్సు చేసింది. రెండు దశాబ్దాలుగా తమ ఖాతాలకు నిరంతరం సహకారం అందించడం ద్వారా తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించే వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లకు రూ.50,000 అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే ఈ ప్రయోజనాల అర్హత ఆ వ్యక్తి జీతం పరిధిపై ఆధారపడి ఉంటుంది. రూ. 5,000 వరకు ప్రాథమిక జీతం తీసుకునే వ్యక్తులు రూ. 30,000 ప్రయోజనం పొందుతారు. రూ.5,001 నుంచి రూ.10,000 మధ్య ఆదాయం పొందుతున్న వారు రూ.40,000 పొందవచ్చు. రూ. 10,000 కంటే ఎక్కువ ప్రాథమిక వేతనం ఉన్న వ్యక్తులు ఈ ప్రోగ్రామ్ కింద గరిష్టంగా రూ. 50,000 ప్రయోజనం పొందవచ్చు 

ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌లు ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అదే ఈపీఎఫ్ ఖాతాకు నెలనెలా క్రమం తప్పకుండా సహకారం అందించాలి. ఉద్యోగాలు మారినప్పటికీ సహకారాల కొనసాగింపును నిర్ధారించడానికి ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ ఖాతాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలే తప్ప కొత్త ఖాతా ప్రారంభించకూడదు. ఇలాల చేయడం ద్వారా ఈపీఎఫ్ఓ చందాదారులు తమ పదవీ విరమణ ప్రయోజనాలను పెంచుకోవడానికి, అలాగే సంస్థ అందించే లాయల్టీ-కమ్-లైఫ్ ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..