OLA Move OS5: ఓలా ఈవీ స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మూవ్ ఓఎస్-5

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లు అమితంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓలా కంపెనీ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. అమ్మకాల్లోనే ఈ కంపెనీ స్కూటర్లు టాప్ లెవెల్‌లో ఉన్నాయంటే వీటి క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఓలా కంపెనీ తన గ్యాడ్జెట్ ఓలా మూవ్ ఎస్-5ను లాంచ్ చేసింది.

OLA Move OS5: ఓలా ఈవీ స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మూవ్ ఓఎస్-5
Move Os5

Updated on: Dec 25, 2024 | 3:30 PM

ఓలా ఎలక్ట్రిక్ తన ఈవీ స్కూటర్ల కోసం మూవ్ ఓఎస్‌-5 బీటాను విడుదల చేయనుంది. ఈ గ్యాడ్జెట్ దీపావళికే అందుబాటులో ఉంటుందని ముందుగా ప్రకటించినా అనివార్య కారణాల వల్ల లాంచ్ ఆలస్యమైంది. ఓలా ఎలక్ట్రిక్ విక్రయించే ఎస్1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూవ్ ఎస్ శక్తినిస్తుంది. మూవ్ ఓఎస్ 5 ఫీచర్ల వివరాలు పూర్తిగా వెల్లడించకపోయినప్పటికీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ మూవ్ ఓఎస్-5లో గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఓలా మ్యాప్స్ అందించే రోడ్ ట్రిప్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే అదనంగా స్మార్ట్ ఛార్జింగ్, స్మార్ట్ పార్క్, టీఎంపీఎస్ అలర్ట్లతో పాటు వాయిస్ అసిస్టెంట్, క్రుట్రిమ్ ఏఐ అసిస్టెంట్ ద్వారా అందుబాటులో ఉండే ప్రిడిక్టివ్ ఇన్ సైట్ల వంటి ఫీచర్లతో ఆకర్షిస్తుంది. 

మూవ్ ఓఎస్ 5లో ఏడీఏఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల స్కూటర్ ఏ వస్తువునైనా ఢీకొనే సందర్భంలో హెచ్చరికలను ఇస్తుంది. అలాగే రోడ్ ట్రిప్ మోడ్ ట్రిప్ ప్లాన్ చేయడానికి స్మార్ట్ రూట్ సూచనలతో సహాయపడుతుంది. పార్కింగ్ సమయంలో అడ్డంకులను గుర్తించడంలో స్మార్ట్ పార్క్ సహాయపడుతుంది. అలాగే క్రుట్రిమ్ వాయిస్ కంట్రోల్ అసిస్టెంట్‌గా కూడా పని చేస్తుది ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ Electric ఇటీవల భారతీయ మార్కెట్ కోసం రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఓలా గిగ్ డెలివరీ ఈ-స్కూటర్, ఓలా ఎస్1 జెడ్‌లను రిలీజ్ చేసింది. పోర్టబుల్ హెూమ్ ఇన్వర్టర్లుగా పనిచేసేలా రూపొందించిన వినూత్నమైన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లు ఈ స్కూటర్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. 

ఓలా గిగ్, ఎస్1 జెడ్ ఈ-స్కూటర్ మోడల్ లు రెండూ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కటి 1.5 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్‌తో అందుబాటులో ఉంటాయి. ఓలా గిగ్ ప్రారంభ ధర రూ.39,999 గా నిర్ణయించారు. అలాగే ఈ స్కూటర్ల బుకింగ్‌ను ఓలా ప్రారంభించింది. ఓలా ఎస్1 జెడ్ ప్రత్యేకంగా వ్యక్తిగత రవాణాను కోరుకునే పట్టణ ప్రయాణికుల కోసం రూపొందిస్తే ఓలా గిగ్ ఈ- స్కూటర్ గిగ్ ఎకానమీ వినియోగదారుల కోసం రూపొందించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి