భారతదేశంలో త్వరలో లాంచ్ చేయబోయే హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ స్ట్రీట్ ఫైటర్‌ను ఇటలీలోని మిలన్లో జరిగిన ఈఐసీఎంఏ 2024 ఈవెంట్లో ఆవిష్కరించారు. ఈ బైక్ 2025 జనవరి చివరలో భారత్‌లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హీరో ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే హీరో మోటోకార్ప్ రాబోయే స్ట్రీట్ ఫైటర్ కోసం లాంచ్ టైమ్ లైన్ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. కానీ ఈ బైక్ కంపెనీ ప్రీమియా నెట్ వర్క్ ఆఫ్ ప్రీమియం డీలర్షిప్ల ద్వారా మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ డిజైన్ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. అగ్రెసివ్ హెడ్ యూనిట్‌తో మస్క్యులర్ సిల్హౌట్‌తో వచ్చే ఈ బైక్ మెరుగైన విజిబిలిటీ కోసం ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌తో ట్రేల్లిస్ ఫ్రేమ్‌తో లాంచ్ చేసే అవకాశం ఉంది. హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ క్వార్టర్-లీటర్ విభాగంలోకి ప్రవేశించడానికి హీరో కొత్త ఇంజిన్‌ను రూపొందించారు. ఈ బైక్ 250 సీసీ లిక్విడ్- కూల్డ్, డీఓహెచ్‌సీ, 4 వాల్వ్, సింగిల్-సిలిండర్ ఇంజన్, 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ యూనిట్ 9,250 rpm వద్ద 29.5 బీహెచ్‌పీ, 7,250 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 25 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ 3.25 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
50:50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో ట్రేల్లిస్ ఫ్రేమ్ చుట్టూ నిర్మించి హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ ముందు భాగంలో 43 మిమీ అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్‌తో పాటు వెనుక భాగంలో ఆరు దశల ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్ ఆకట్టుకుటుంది. హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ స్విచ్ చేసేలా ఏబీఎస్ మోడ్స్‌తో కూడిన ట్విన్ డిస్క్ బ్రేక్లను కలిగి ఉంది. హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్ మీడియా నియంత్రణలను కలిగి ఉండే టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి