లక్షలాది మంది రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల తేదీని ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన 15వ విడత సొమ్ము నవంబర్ 15న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఈ విడతలో 8 కోట్ల మంది రైతులకు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు. ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా సొమ్మును బదిలీ చేస్తారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. ఇది రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. ఇప్పటి వరకూ 8.5 కోట్ల మంది అర్హులైన రైతుల కోసం 17,000 కోట్ల రూపాయల సొమ్మును అందించారు. పీఎం కిసాన్ 14వ విడతను జూలై 27న విడుదల చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..