EPFO: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు గుడ్‎న్యూస్.. పరిహారం రెట్టింపు చేసిన సంస్థ..

|

Nov 11, 2021 | 8:48 PM

ఈపీఎఫ్‌వో తమ ఉద్యోగులకు గుడ్‎న్యూస్ చెప్పింది. పరిహారం రెట్టింపు చేసినట్లు ప్రకటించింది. ప్రమాదవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే నామినీకి ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నామని వెల్లడించింది...

EPFO: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు గుడ్‎న్యూస్.. పరిహారం రెట్టింపు చేసిన సంస్థ..
Epfo
Follow us on

ఈపీఎఫ్‌వో తమ ఉద్యోగులకు గుడ్‎న్యూస్ చెప్పింది. పరిహారం రెట్టింపు చేసినట్లు ప్రకటించింది. ప్రమాదవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే నామినీకి ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు ఈపీఎఫ్‌వో ఉత్తర్వులు జారీ చేసింది. ఈపీఎఫ్‌వో ఉద్యోగి అనుకోకుండా మరణిస్తే కుటుంబానికి సంస్థ పరిహారం చెల్లిస్తుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఈపీఎఫ్‌వోలో పనిచేస్తున్న 30వేల మందికి ప్రయోజనం కలగనుంది.

సహజ మరణం చెందితేనే ఈ పరిహారం ఇస్తుంది. కరోనాతో మరణిస్తే పరిహారం అందదు. ఉద్యోగి కోవిడ్ వల్ల మృతి చెందితే 2020, ఏప్రిల్‌ 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పరిహారం చెల్లిస్తారు. గతంలో ఉద్యోగి మరణిస్తే చాలా తక్కువ మొత్తంలో పరిహారం ఇచ్చేవారు. 2006లో ఉద్యోగి అకాల మరణం చెందితే రూ.50 వేలు ఇచ్చేవారు. దానిని తర్వాత రూ. 4 లక్షల 20 వేలకు పెంచారు. అనంతరం మూడు సంవత్సలకు ఒకసారి పది శాతం పెంచారు. అయితే పరిహారంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిహారం రూ. 10 నుంచి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రూ. 4.20 వేలు ఉన్న పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Read Also.. Paytm IPO: వాటా విక్రయాల్లో చరిత్ర సృష్టించిన పేటీఎం.. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే ఛాన్స్..!

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం నెమ్మదిగా..

5G Spectrum: వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం!.. టెలికాం రంగంలో మరిన్ని మార్పులు..

Work From Home: సమయం దాటినా పని చేయమంటే.. జరిమానా కట్టాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన పోర్చుగీస్..