IDBI Bank FD: కస్టమర్లకు ఐడీబీఐ బ్యాంక్‌ శుభవార్త.. ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ప్రకటన.. వడ్డీ రేటు ఇదే

|

Jul 18, 2023 | 9:45 PM

కొన్ని బ్యాంకులు కస్టమర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ బ్యాంకు అయిన ఐడీబీఐ తాజాగా పరిమిత కాలానికి మాత్రమే ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది . 375 రోజుల కొత్త పథకం జూలై 14, 2023 నుంచి అమలులోకి వస్తుంది. 375 రోజుల ప్రత్యేక మెచ్యూరిటీ బకెట్‌పై ఐడీబీఐ బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

IDBI Bank FD: కస్టమర్లకు ఐడీబీఐ బ్యాంక్‌ శుభవార్త.. ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ప్రకటన.. వడ్డీ రేటు ఇదే
Fixed Deposit
Follow us on

సాధారణంగా కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ పడింది. అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ బ్యాంకు అయిన ఐడీబీఐ తాజాగా పరిమిత కాలానికి మాత్రమే ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది . 375 రోజుల కొత్త పథకం జూలై 14, 2023 నుంచి అమలులోకి వస్తుంది. 375 రోజుల ప్రత్యేక మెచ్యూరిటీ బకెట్‌పై ఐడీబీఐ బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ 375 రోజులు, 444 రోజులు వ్యవధి ఉన్న డిపాజిట్లల్లో పెట్టుబడి 2023 ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఐడీబీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఐడీబీఐ బ్యాంక్ 375 రోజులకు అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో 7.60 శాతం గరిష్ట వడ్డీ రేటును ఆగస్టు 15, 2023 లోపు పెట్టుబడి పెట్టిన వారికి చెల్లిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న 444 రోజులకు అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీపై గరిష్ట రేటు 7.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే నాన్-కాల్ చేయదగిన ఎంపిక కింద గరిష్ట రేటు 7.75 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఈ డిపాజిట్‌ పథకంపై సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర​ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకాన్ని ఐడీబీఐ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఐడీబీఐ తాజా వడ్డీ రేట్లు ఇవే

ఐడీబీఐ ఏడు రోజుల నుంచి ఐదు సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు జూలై 14, 2023 నుంచి  అమలులోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి
  • 07-30 రోజులు 3.00 శాతం
  • 31-45 రోజులు 3.25 శాతం
  • 46- 90 రోజులు 4.00 శాతం
  • 91-6 నెలలు 4.50 శాతం
  • 6 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం 5.75 శాతం
  • 1 సంవత్సరం నుంచి  2 సంవత్సరాల వరకు (375 రోజులు, 444 రోజులు మినహా) 6.80 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు 6.50 శాతం
  • 5 సంవత్సరాల నుంచి  10 సంవత్సరాలు 6.25 శాతం

సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రేట్లు ఇలా

ఐడీబీఐ బ్బ్యాంకు వృద్ధులకు ఏడు రోజుల నుంచి ఐదు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్‌లకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం