DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఈ నెలలోనే డీఏ పెంపు ప్రకటన?

|

Sep 01, 2023 | 4:00 PM

ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. డియర్‌నెస్ అలవెన్స్ చివరిసారిగా మార్చి 2023లో పెంచారు. ఆ సమయంలో దాదాపు డీఏను 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు అందించే జీతం/పెన్షన్ విలువపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఉపశమన చర్యగా డీఏ/డీఆర్‌ అందిస్తారు.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఈ నెలలోనే డీఏ పెంపు ప్రకటన?
Cash
Follow us on

డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డీఏ పెంపు ప్రకటన సెప్టెంబరు 2023లో కేంద్రం చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. డియర్‌నెస్ అలవెన్స్ చివరిసారిగా మార్చి 2023లో పెంచారు. ఆ సమయంలో దాదాపు డీఏను 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు అందించే జీతం/పెన్షన్ విలువపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఉపశమన చర్యగా డీఏ/డీఆర్‌ అందిస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా ఆధారంగా కేంద్రం డీఏ/డీఆర్‌ పెంపు ప్రకటన చేస్తారు. 

మూడు శాతం పెంపు?

జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటినందున కేంద్ర ప్రభుత్వం ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 3 శాతం పాయింట్లు పెంచి 45 శాతానికి చేరుస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకసారి ప్రకటించిన తర్వాత కొత్త డీఏ పెంపు జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. జూన్ 2023కి సంబంధించిన ఏఐసీపీఐ-డబ్ల్యూ డేటా ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ పెంపు 3 శాతం పాయింట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే కేంద్రం ఎప్పుడూ డీఏ/డీఆర్‌ని దశాంశ బిందువు కంటే ఎక్కువ పెంచడాన్ని పరిగణించదు. దీంతో కేంద్రం ఈసారి డీఏను 3 శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డీఏ పెంపు లెక్కింపు ఇలా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్‌ల కోసం డీఆర్‌ ప్రతినెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ-డబ్ల్యూ) ఆధారంగా లెక్కిస్తారు. అయితే దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జూన్ 2023కి సంబంధించిన సీపీఐ-డబ్ల్యూ జూలై 31, 2023న విడుదలైంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం దాని ఆదాయ చిక్కులతో పాటు డీఏను పెంచే ప్రతిపాదనను రూపొందిస్తుందని, ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను ఉంచుతుందని ఆపై డీఏ పెంపు ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి